స్తంభించిన ట్రాఫిక్…

నగరంలో రోడ్లపై ప్రవహిస్తున్న నీరు..
హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన భారీ వానలకు జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్‌లో గత వందేండ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరూర్‌నగర్ చెరువు పూర్తిగా నిండటంతో దిగువప్రాంతాల్లో భారీగా వరదనీరు ప్రవహిస్తున్నది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వరకు చిన్న వాహనాలకు పోలీసులు అనుమతించడంలేదు. రహదారులపై నీటి నిల్వతో చిన్న వాహనాలను దారిమళ్లిస్తున్నారు. దిలుసుఖ్‌నగర్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. దీంతో దిల్సుఖ్నగర్లని చైతన్యపురి వద్ద రోడ్డుపై ఉదృతంగా నీరు ప్రవహిస్తున్నది. మూడు బస్సులు, కార్లు నీటిలో చిక్కుపోయాయి. దీంతో దిల్సుఖ్నగర్ నుంచి కోఠీ వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. చైతన్యపురి, పీఎన్టీ కాలనీ, కొత్తపేట్ డివిజన్ మోహన్ నగర్‌లోని కాలనీలు నీటిలో మునిగిపోయాయి. చంపాపేట, రాజిరెడ్డినగర్, రెడ్డి కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నగరంలోని సుమారు 1500 కాలనీలు నీటమునిగాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. చాలాచోట్ల 20 సెం.మీ.కుపైగా వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ఘట్కేసర్ సింగపూర్ టౌన్షిప్లో 32.2 సెం.మీ. వర్షపాతం, హయత్‌నగర్‌లో 29.4, హస్తినాపురంలో 28.3 సెం.మీ., అబ్దుల్లాపూర్లో 26.5, ఇబ్రహీంపట్నంలో 25.6 సెం.మీ., సరూర్‌నగర్‌లో 27.1, ఉప్పల్‌లో 25.3 సెం.మీ., ముషీరాబాద్‌లో 25.2 సెం.మీ, బండ్లగూడలో 23.3 సెం.మీ., మేడిపల్లిలో 23.2 సెం.మీ. సికింద్రాబాద్‌లో 22.3 సెం.మీ., మల్కాజిగిరిలో 22.2 సెం.మీ. వర్షపాతం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో మూడు రోజులపాటు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు
Some really excellent information, Glad I discovered this. “Use your imagination not to scare yourself to death but to inspire yourself to life.” by Adele Brookman.