‘అమె’కు పాదాభివందనం…

277

ఆమె

2014కు ముందు
ఇంట్లోనో
పొలం లోనో
ఉద్యోగం లోనో
పనీ…పనీ…పనీ
పిల్లలు…వాళ్ల చదువులు..వాళ్ల ఫంక్షన్లు…ఏదొక పని
కాలం తెలియనంత పని.
కాస్త…ఖాళీ దొరికితే
టీవీలో సీరియలో,
సినిమానో కాలక్షేపం.
అప్పట్లో
టీవీ డిబేట్ అంటే తెలియదు
టీవీ 5 మూర్తి, సాంబశివరావు గారు,ఏబిఎన్ వెంకటకృష్ణ,సాక్షి కొమ్మినేని ..ఎవ్వరూ తెలియదు.
అదో లోకం…పాత బంగారు లోకం.

2014తర్వాత
పొలం పని లేదు.ఉద్యోగంలోనో,భర్త వ్యాపారంలోనో,పిల్లల చదువుల హడావుడిలోనో…కాలం గడిచేది.
అసెంబ్లీ,సచివాలయం,హై కోర్ట్ …ఊహ తెలిసినప్పటి నుండి హైదరాబాద్ లో చూసిన వ్యవస్టలు ఒక్కొక్కటీ…వస్తుంటే.
వేలాది భవనకార్మికుల స్వేదం 24 X 7 పారుతుంటే…చంద్రబాబు ఒక్కో ఆలోచన ఒక్కో భవనమై…భూమిని చీల్చుకుని మొలుస్తుంటే…
స్పీడ్ యాక్సిస్ రోడ్‌తో గంటల ప్రయాణం నిముషాల కొచ్చి విశ్వనగరం…అమరావతి ఆవిర్భావం జరుగుతుండగా…2019 ఎన్నికలు.

2019 ఎన్నికల పలితాలు
ప్రభుత్వంలో మార్పనుకున్నాం…పాలకులే మారతారానుకున్నాం…విధానాలు…విధి రాత మారతాయానుకోలేదు.
విశ్వ నగరం ఆగింది.ముంపు,శ్మశానం,ఎడారి…ఇవి మా ఊరికి మారు పేర్లయ్యాయి.దళిత బహుజన అమరావతి కాస్తా కమ్మరావతి అయింది.
చివరికి రాజధాని మూడుముక్కలైంది.

2019 డిసెంబర్ 17 తర్వాత
ఇంటా…బయటా స్మశాన నిశ్శబ్దం.రెప్పల మాటున ఉప్పు సముద్రం.ఉడుకుతున్న బువ్వలో..విషం చిమ్మిన 151 సీట్లు. అమరావతి దేహం నిండా విషపు గోళ్ల గాట్లు.
బతుకు గాల్లో దీపాల్లా పిల్లల జీవితాలు.ఒకటే ప్రశ్న….ఏం చేయాలి?ఏం చేయాలి??ఏం చేయాలి???
మన ఖర్మ–ముసలోళ్ళ మాట
మనకింతే రాసుంది–కట్టు కున్నొడి మాట
కళ్ల ముందే కూలుతున్న పిల్లల బతుకు కోట.

ఎదో చెయ్యాలి..
ఏదైనా చెయ్యాలి..
రాజధాని కోసం
అమరావతి కోసం

ఆ క్షణాన…ఆమె మెదడు పొరల్లో పుట్టిన వాక్యమే …నినాదమై గొంతు చించుకుని బయటికొచ్చింది.
జై అమరావతి …జై జై అమరావతి.

చూస్తుండగానే…దీక్షా శిబిరమైంది…
ఉద్యమ కెరటమైంది
అమరావతి రక్షణ లక్ష్యమైంది
జేఏసి లైంది
జన ప్రభంజనమైంది
ర్యాలీ లైంది
ధర్నా లైంది
మీడియా ముఖ చిత్రమైంది.
పగలు శిబిరంలో ధైర్య వచనాల కోసం ఎదురుచూపులు …రాత్రి కలత నిద్రలో బెదురుచూపులు.

ఒకటా…రెండా…మూడు వందల రోజులు..
దుర్గమ్మ పూనినట్టు చలించని ధైర్యం
అంబేడ్కర్ ఆవహించినట్టు
రాజ్యాంగం మీద
రాజకీయాల మీద
పౌర హక్కుల మీద
ప్రజల బతుకుల మీద
తుగ్లక్ విధానాల మీద
కమలం కుట్రల మీద
కాటేసే చట్టాల మీద
కాపాడే కోర్టుల మీద
Any Topic
Ready for Debate

మూడు వందల రోజుల ఉద్యమం
పోరాటం నేర్పింది..
త్యాగాలు నేర్పింది ..
వినడం నేర్పింది …
విశ్లేషణా నేర్పింది..

మాట్లాడడం నేర్పింది …మాట్లాడడం నేర్పింది …మాట్లాడడం నేర్పింది

ఇప్పుడామె మాట్లాడుతుంది.రాజధాని గురించి,రాష్ట్రం గురించి,విభజన చట్టం గురించి,’ప్రత్యేక ‘మోసం గురించి…
ఇప్పుడామె మాట్లాడుతుంది సూటిగా అమరావతి కోసమే కాదు…ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం.
ఆమే అమరావతి మహిళ….అమెకు పాదాభివందనం🙏🙏🙏
అమరావతి ఆవేదనను అత్యంత దగ్గరగా చూసిన అనుభవంతో..

-డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

1 COMMENT