బాబు ఇంటికి మళ్లీ నోటీసులు

389

అమరావతి : ఏపీలోని కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు మరోసారి అధికారులు నోటీసులిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి మరోసారి నోటీసులు పంపారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవాహం చేరుకుంది.కరకట్ట నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందేనని.. సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఏక్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని రెవెన్యూ శాఖ ముందుగా అలెర్ట్ అయ్యింది. కాగా.. కృష్ణా నదిలో 6లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది.

1 COMMENT