కోవిడ్ మహిళకు కొత్త జన్మ ఇచ్చిన యశోద వైద్యులు

499

ప్రాణాoతకమైన, తీవ్ర కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న 58 ఏళ్ళ మహిళకు “ఎక్మో” సాయంతో కొత్త జీవితాన్ని ఇచ్చిన ‘యశోద హాస్పిటల్స్’ వైద్యులు

తీవ్రమైన (కోవిడ్ -19) కరోనా ఇన్ఫెక్షన్ మరియు తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న తెలంగాణ రాష్టం కోరుట్లకు చెందిన 58 సంవత్సరాల మహిళకు అత్యాధునిక ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) చికిత్స ద్వారా దాదాపు 10 రోజుల్లోనే ఆమె ప్రాణాలు కాపాడి యశోద హాస్పిటల్స్ వైద్య బృందం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ చికిత్సలో కొత్త మైలురాయిని సాధించింది.

“ఎక్మో చికిత్స ఎప్పుడు చేయవలసివస్తుంది… ఏదైనా శస్త్రచికిత్స చేసే సమయంలో లేదా ఇతర వ్యాధులతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు పనిచేయని వారికి ‘ఎక్మో’ ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్రధాన అవయవాల బాధ్యతను ఎక్మో పరికరం తలకెత్తుకుని ప్రాణాలను నిలబెడుతుంది. ప్రాణాoతకమైన న్యుమోనియా, ఊపిరితిత్తుల కేన్సర్‌, సీపీఓడీ, ముఖ్యంగా తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ మొదలైన రుగ్మతలతో రోగి తనంతట తాను స్వయంగా శ్వాస తీసుకోలేని సందర్భంలో ఎక్మో పరికరం ఎంతాగానో ఉపయోగపడుతుంది. అలాగే గుండె కవాటాలు దెబ్బతిని, గుండె పనిచేయని స్థితిలో కూడా ఇదే పరికరం తోడ్పడుతుంది. ఈ సమయాల్లో పరికరాన్ని అమర్చి, చికిత్స కొనసాగిస్తారు”. అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి అన్నారు.

“తెలంగాణ రాష్టం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీమతి. భారతి, 16 సెప్టెంబర్ 2020 న సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన ఆమె తీవ్రమైన (కోవిడ్-19) కరోనా ఇన్ఫెక్షన్ మరియు తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో పాటు ఉబకాయం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స ప్రారంభించారు. అధిక ఆక్సిజన్ సహాయంతో రోగి 70% కంటే ఎక్కువ ఆక్సిజన్ స్థాయి

అందుకోకపోవడం వలన, వైద్యుల బృందం కృత్రిమ శ్వాస (వెంటిలేటర్‌) సహాయం అవసరం అని నిర్ణయించుకుని 17 సెప్టెంబర్ 2020న ప్రారంభించరు. వెంటిలేటర్ మద్దతులో కూడా, ఆమె ఆక్సిజన్ స్థాయిలు 80-90% మధ్య 100% Fi02 తో హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఆ సమయంలో వైద్యుల బృందం కుటుంబ సభ్యులతో వివరంగా చర్చించి, కుటుంబ సభ్యులకు ‘ఎక్మో’ చికిత్స గురించి వివరించి వారి అంగీకారంతో ఆమెను 19 సెప్టెంబర్ 2020న ఎక్మో లో ఉంచారు. ఎక్మో ను ప్రారంభించిన తరువాత పేషెంట్ యొక్క ఆక్సిజనేషన్ మెరుగుపడింది. కానీ బ్యాక్టీరియా సంక్రమణ శ్లేష్మ ప్లగ్ ద్వారా అడ్డంకి కారణంగా ఆమెకు ఎడమ ఊపిరితిత్తి అకస్మాత్తుగా పనిచేయకుండాపోయింది. వైద్యుల బృందం అత్యవసర బ్రోంకోస్కోపీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ (కోవిడ్-19, కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో వైద్యులకు అధిక ప్రమాద ప్రక్రియ) యశోద హాస్పిటల్స్ వైద్య బృందం ధైర్యంగా బ్రోంకోస్కోపీ చేసి శ్లేష్మం తొలగించి ఊపిరితిత్తులను తిరిగి తెరవగలిగింది. దీంతో కోలుకున్న శ్రీమతి భారతి 28 సెప్టెంబర్ 2020 న ‘ఎక్మో’ నుండి తొలగించబడింది. ఆమె ట్రాకియోటోమీపై 05 అక్టోబర్ 2020 న హాస్పిటల్ నుండి పునరావాస కేంద్రానికి డిశ్చార్జ్ చేయబడింది, అక్కడ ఆమె శారీరక శిక్షణ పొందిన తరువాత ఇంటికి మార్చబడుతుంది”. అని యశోద హాస్పిటల్స్ పల్మోనాలజిస్ట్ డాక్టర్. హరికిషన్ గోనుగుంట్ల తెలిపారు.

“ఎక్మో చికిత్స సులభం కాదు… ఎక్మో చికిత్సకు నిపుణులైన ఇంటెన్సివ్ కేర్ వైద్య బృందం అవసరం, ముఖ్యంగా కోవిడ్-19 సమయాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు వైద్య సిబ్బంది అవసరం. 10,000 కంటే ఎక్కువ డిశ్చార్జెస్ కలిగిన అత్యధిక సంఖ్యలో కోవిడ్ రోగులకు చికిత్స చేసిన అనుభవం ఉన్న ఆసుపత్రులు యశోద హాస్పిటల్స్, ఎక్మో మరియు ఊపిరితిత్తుల మార్పిడి కోసం ప్రత్యేకమైన బృందాన్ని కలిగి ఉంది. తీవ్రమైన కోవిడ్ తో బాధపడుతున్న మరియు పోస్ట్ కోవిడ్ ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ తో బాధపడుతున్న కొద్దిమంది రోగులు ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు”. అని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ ప్రధాన కార్య నిర్వహణాధికారి డాక్టర్. విజయ్ కుమార్ తెలియజేసారు.

For further information, please contact Mr. Sampath on  78930 53355 / 88971 96669