పంజాబ్ లో ఏం జరుగుతోంది…?

372

(హనుమాన్ ప్రసాద్ శర్మ)

సిక్కులను ఊచకోత కోసింది కాంగ్రెస్సు వారు, ఇంకా స్వర్ణ దేవాలయం మీద పాశవిక దాడి చేసింది కూడా వారి నాయకత్వములోనే… అయినా…ఇప్పుడు ఇలా…వై??నాటి ఔరంగజేబు నుండి నేటి పోర్కిస్తాని పాలకుల దాకా, కాశ్మీరి ఉగ్రవాదులతో సహా సిక్కులను భాధించారు..వేధించారు..అయినా ఇప్పుడు.. ఇలా.. ఎందుకు… ఖలిస్తాన్ పేరుతో ఐ ఎస్ ఐ చేతుల్లో పావులుగా మారిపోయారు…నాడు 1984 లో కాపాడిన వారిని.. రాజకీయముగా అండగా ఉన్న వారిని.. దేశ చిత్రపటములో పంజాబ్ గురించి పాజిటివ్ గా ప్రచారము చేసి తోడుగా ఉన్నవారిని నేడు వ్యతిరేకిస్తున్నారు.. వ్యవసాయ బిల్లుల పేరిట వీరంగాలు చేస్తూ…ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు.. ఎందుకు, ఎవరు వీరు.. కారణములు ఏమిటీ…పంజాబ్…సస్యశ్యామల ప్రాంతము…నదుల నీరు..పచ్చని పొలాలు…కష్టించే శ్రమజీవులు..పూజ్య గురునానక్ జి ఆధ్యాత్మికతో, సిక్కు గురువుల త్యాగాలతో ఊపిరిపోసుకున్న గొప్ప ధార్మిక జీవనముతో కళకళలాడిన నేల పంజాబ్… విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి ధర్మాన్ని నిలబెట్టిన వీరుల గడ్డ…పంజాబ్.

కానీ, నాణానికి రెండో వైపున, జాట్ కుల సుప్రిమసీతో అతలాకుతలం అవుతున్నది… వీరు కులరహిత సిక్కు సమాజాన్ని సైతం చెరబట్టి, ఇతరులను ముఖ్యంగా రవిదాసియా వర్గాన్ని, సిక్కుల్లోని క్రింది కులాలను అణచివేస్తున్న తీరు – సామాజిక, రాజకీయ, ఆర్ధిక & ఆధ్యాత్మిక జీవితాలపైన పెను ప్రభావాన్ని చూపుతోంది.సరిగా ఇదే సమయములో, క్రింది తరగతి సిక్కులు, హిందువులు, రవిదాస్సియాలు (అంటే చమార్లు) ఒక దగ్గరగా చేరుతూ…ఒక బ్లాక్ గా మారుతున్న సామాజిక స్థితి…వీరికి అందుబాటులోకి – అండగా ఒక రాజకీయ వేదికగా ఉధ్భవిస్తున్న జాతీయవాద పార్టీగా బీజేపీ తన మాతృ సంస్థ యొక్క విభాగాల ద్వారా వీరిలోకి చొచ్చుకు పోయి చేస్తున్న ఔట్ రీచ్ ప్రోగ్రాంసు ఇస్తున్న ఫలితాలు… నేడు హిందూ జాట్ & సిక్కు జాట్ నాయకుల కుల-కుటుంబ పార్టీలు అయిన కాంగ్రెస్సు మరియు శిరోమణి అకాళీ దళ్ వంటి వారికి భవిష్యత్తు పట్ల భయం కల్గిస్తూ, తిరిగి ఎలాగైనా పట్టు సాధించాలి అన్న ప్రయత్నములో భాగముగానే ఈ వ్యవసాయ బిల్లుల పైన పోరాటము అంటూ వీధుల్లోకి రావడం.సామాజికముగా చిన్న సన్నకారు రైతులు కనుక మండీల నుండి విముక్తుడు అయితే, వాటి ద్వారా రాజకీయాధికారాన్ని ఎంజాయ్ చేస్తూన్న అగ్రకుల జాట్ ఆధికార పార్టీల మనుగడ కష్టమే.

వ్యతిరేకత బిల్లుల మీద కాదు, జరుగబోయే సామాజిక సశక్తీకరణ (ఎంపవరుమెంటు) మీదనే…ఇప్పటికే హర్యాణాలో జరిగిన సామాజిక అధికార మార్పు బదిలి చూసారుగా..అదే భయం.ట్రాక్టర్సు తగలబెట్టడం వారి యొక్క అహంకారాన్ని చూపిస్తోంది… అయినా 1984లో మనుష్యులనే బూడిద చేసినవారికి ఇదేమి కష్టం కాదు కదా!భారతీయ ధార్మిక రక్షణ కోసము బలిదానాలు చేసిన మహనీయ-పూజ్య సిక్కు గురువుల ఆశీస్సులు ఎప్పుడూ ధర్మం వైపే…. సామాజిక న్యాయము వైపే.

1 COMMENT