ఎమ్మెల్సీ బరిలో జర్న’లిస్ట్’లు

పోటా పోటీగా పోటీ

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ బరిలో ఈసారి జర్నలిస్టులు పోటీలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని గానూ ఈసారి జర్నలిస్టులు పోటాపోటీగా పోటీ చేస్తున్నారు.

రాణి రుద్రమ: టీవీ9, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, హెచ్ ఎం టీవీ వంటి ప్రధాన స్రవంతి మీడియాలో పని చేసిన అనుభవం తో బాటు దశ దిశ వంటి ప్రోగ్రాంలకు సమన్వయ కర్త గా, ప్రయోక్త గా వ్యవరించి ప్రజల్లోకి వెళ్లగలిగారు. యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

జయ సారధి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్న జయ సారధి రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు. సిపిఐ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ పోటీలో దిగనున్నట్టు సహచరులతో తెలిపాడు. మొదట కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందనే విశ్వాసం ఉన్నప్పటికీ వారి నిర్ణయం కోసం ఎదురు చూడకుండా తాను రంగం లోకి దిగుతున్నట్టు ప్రకటించాడు.

పీ వీ శ్రీనివాస్: పీవీ శ్రీనివాస్ టీ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నాడు. గతంలో టీవీ9 లో పని చేసిన అనుభవం ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో పని చేసిన చరిత్రతో బాటు, ఖమ్మం జిల్లాలో ఓ వామ పక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు, ప్రజా సంఘాలతో అనుబంధం కలిసి వస్తుందనే విశ్వాసం. ఎమ్మెల్సీ స్థానానికి తాను కూడా అర్హుణ్ణే అని ఆత్మీయుల సమ్మేళనం లో ప్రకటించాడు. అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించాల్సివుంది. ఖరారయ్యే అవకాశాలున్నాయి.

తీన్మార్ మల్లన్న: తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ స్థానంలో రంగంలో తిరుగుతున్నట్టు గతకొంత కాలంగా చెబుతూనే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న గతంలో v6 ఛానల్ లో పనిచేసి తర్వాత 10 టీవీ కి మారారు. ఇప్పుడు టీవీ ఫైవ్ లో స్లాట్ కు పని చేస్తున్నాడు. తాను క్యూ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి ఏ అభ్యర్థినీ ప్రకటించలేదు. కాగా కోడూరు మానవతారాయ్ మాత్రం తాను ఎమ్మెల్సీ బరిలో ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. మరోవైపు తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్ తానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరి నిముషంలో మద్దతు పలికే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఈసారి జర్నలిస్టులు ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలోకి దిగటం కొంత ఆశాజనకమైన పరిణామం అయినప్పటికీ పట్టభద్రులు ఎటు మొగ్గుచూపుతారు అనే విషయం వేచి చూడాల్సిందే. ఇందులో కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా లేకపోలేదు..

You may also like...

1 Response

  1. This is very interesting, You are an excessively professional blogger.
    I have joined your feed and look forward to in quest of more of
    your fantastic post. Additionally, I’ve shared your website in my social networks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami