జువెనైల్ యాక్ట్ పై రెండు రోజులు వర్క్ షాప్

727

సీఐడీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ జువెనైల్ యాక్ట్(JJ act)పైన రెండు రోజులు వర్క్ షాప్

జువెనైల్ జస్టిస్ యాక్ట్ – 2015 చట్టం అమలు చేసే విధానం , చట్టం అమలు సామర్థ్యాన్ని పెంచడానికి , చట్టం అమలు చేయడం లో సంబంధిత అన్ని శాఖల మధ్య అంతరాన్ని గుర్తించడం, సమన్వయపరచడంతో పాటు లోటుపాట్లను గుర్తించడం, వాటికి పరిష్కారనికి తీసుకోవలసిన సూచనలపైన రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఈ వర్క్ షాప్ ను ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  గౌతం సవాంగ్  ఆధ్వర్యంలో సి.ఐ.డి అడిషనల్ డి‌జి పి.వి.సునిల్ కుమార్ ఐపిఎస్ నేతృత్వంలో అన్ని శాఖలు పోలీస్, జుడీషియల్ డిపార్ట్మెంట్, జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జి మరియు మెంబెర్స్, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ప్రోబిషన్ ఆఫీసర్స్, స్వచ్చంధ సంస్థలు, బాలబాలికల సంరక్షణ సంస్థల భగస్వామ్యంతో రెండు రోజులు వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది.

ప్రధానంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిషనల్ డీజీ పి.వి.సునీల్ కుమార్ ఐపిఎస్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సంధర్భంగా ఎ.పి డిజిపి గౌతమ్ సవాంగ్  మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ను అమలు చేయడంలో పోలీస్ శాఖ తరఫు నుంచి వ్యవస్థీకృత మార్పులు తేవడానికి మా వంతు కృషి చేస్తామని మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న మహిళా మిత్ర లాంటి కార్యక్రమాన్ని బాలబాలికల కోసం నవంబర్ 14 లోపు బాలమిత్ర ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

రెండవ రోజు వర్క్ షాప్ కార్యక్రమంలో హై కోర్ట్ చీఫ్ జస్టిస్  జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి  ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ వారు మాట్లాడుతూ బాల్యం చాలా విలువైనదని దాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు బాల్యం గురించి వేదకాలంలో సూక్తులను హృదయం ద్రవించే విధంగా వర్ణించారు. నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాం వంటి గొప్ప వారు బాల్యం గురించి చెప్పిన సూక్తులను గుర్తు చేశారు.

అదేవిధంగా ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఒక సైకాలజిస్టు ఉండాలని ప్రతి పిల్లవాడిని ప్రత్యేక దృష్టితో చూడాలని తెలియజేసినారు.చట్టంతో విభేదించిన పిల్లలు కూడా బాధితుడిగా పరిగణించాలని తెలిపారు.నేటి బాలబాలికలను మనం అశ్రద్ధ చేసినట్లుయితే రేపటి తరం వారి ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అడాప్షన్ త్వరితగతిన చేసి పిల్లల యొక్క బాల్యంలోనే తల్లిదండ్రులకు చేరువ చేస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియపరిచారు.వారితో పాటు హై కోర్టు జడ్జిలు జస్టిస్ ఎం.గంగారావు మాట్లాడుతూ, సమాజంలో 49.3% బాలలు అల్ప ఆదాయవర్గం వారు ఉన్నారని వారందరికీ కూడా రక్షణ అవసరం ఉన్నదని తెలిపినారు.

జస్టిస్ కె. విజయ లక్ష్మి పాల్గొన్నారు.ఆమె మాట్లాడుతూ అన్ని పిల్లల గృహాలు రిజిస్టర్ అయి ఉండాలని, సంరక్షణ కావలసిన బాలుడు లేక బాలిక వినాలని కుటుంబంతో విడిపోయివేరు గా ఉంటున్న బాల బాలికలను గుర్తించి వారి కుటుంబంతో రీయూనియన్ చేయాలని లేనిపక్షంలో మాత్రమే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేయాలని అదేవిధంగా చట్టంతో ఘర్షణ పడ్డ బాలబాలికలకు ఇవ్వాలని అందరినీ ఒకే తాటిపై కాకుండా ఒక్కొక్క బాల బాలికలను ఇండివిడ్యుల్ గా కేర్ చేయాలని మరియు ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ సెంటర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలియజేసినారు. హిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ.ఆర్. అనురాధ ఐపిఎస్ , మహిళా అభివృద్ధి & పిల్లల సంక్షేమం, బాల్య సంక్షేమం & దిద్దుబాటు సేవలు విభాగం డైరెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా, ఐఎఎస్ పాల్గొన్నారు.

అంతకు ముందు మొదటి రోజు అయా శాఖలలోని జువెనైల్ జస్టిస్ ఆక్ట్ తో ముడిపడి ఉన్న పై అందరి అధికారులు, సంస్థలను సమన్వయ పరచుకుంటూ శాఖ వారీగా రాష్ట్రంలోనే అందరితో వెబినర్ నిర్వహించడం జరిగింది. ఆ వెబినార్ లో చర్చించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇతర శాఖలతో చర్చించి రాష్ట్రం లో అన్ని జిల్లాలను అయిదు జోన్లుగా విభజించి అన్ని శాఖల తో కలిపి మరోమారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఇవ్వడం జరిగింది.

ఈ విధంగా నిర్వహించిన వెబినార్ వల్ల ఆయా శాఖల తో చర్చించిన బా అన్ని శాఖలతో కూడా చర్చించడం జరిగింది.జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 చట్టం అమలు తీరు సామర్థ్యం పెంచడానికి, అమలు పరచడంలో అన్ని శాఖల మధ్య ఉన్న అంతరాలు గుర్తించి తగ్గించడానికి మరియు అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పరచుకోవడానికి ఉన్న లోటుపాట్లు గుర్తించడానికి వాటికి తగిన పరిష్కారం సూచించడం కూడా జరిగింది.

ఈ వేబినర్ వర్క్ షాప్ లో పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడుతున్న గవర్నమెంట్ హోమ్స్ కొరత ఉన్నదని, అదేవిధంగా ప్రెగ్నెంట్ మైనర్ గర్ల్ వసతి కోసం తగిన వసతి గృహాలు లేవని, మానసిక రుగ్మత కలిగిన పిల్లలకు, దివ్యాంగపిల్లల కొరకు ప్రత్యేక సదుపాయాలు కలిగిన వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అంతేకాక ప్రతి నెల అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని వంటి విషయాలు గురించి చర్చించడం జరిగింది. ఈ రెండు రోజుల వర్క్ షాప్ ను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో సి.ఐ.డి విభాగంలో అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ ఐపిఎస్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జ్ ఎస్పీ సరిత మేడం గారు ఆధ్వర్యంలో ఈ వెబినర్ నిర్వహించడం జరిగింది