చైనాకు మోదీ చెక్

532

యుద్ధం అంటే నేరుగా ఆయుధాలతో తలపడడం ఒక్కటే కాదు. ఆధునిక యుద్ధ రీతులు చాలా రకాలుగా ఉన్నాయి. అవేంటో మొత్తం తెలుసుకోవాలంటే పోస్ట్ పెద్దది అవుతుంది కానీ వాటిలో ఒక యుద్ధ నీతి – రీతి గురుంచి తెలుసుకుందాం ప్రస్తుతానికి. లదాఖ్ దగ్గర చైనాతో ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. అటు పూర్తి స్థాయి యుద్ధం జరగదు ఇటు ఉద్రిక్తపూరిత వాతావరణం చల్లబడదు. ఎవరు ముందు బుల్లెట్ పేలుస్తారా అన్నట్లు ఉంది అక్కడ కానీ ఎవరూ బులెట్ పేల్చరు. ఇరువైపులా దాదాపు రెండు లక్షల మంది సైనికులు మోహరించి ఉన్నారు. ఇక ఆర్టిలరీ తో పాటు మెయిన్ బాటిల్ టాంక్శ్ లు, ఆర్మేరడ్ వెహికిల్స్ తో సిద్ధంగా ఉన్నాయి రెండు పక్షాలు. ఒకవైపు శీతాకాలం ముంచుకొస్తున్నది. రోజులో అయిదు లేదా ఆరు గంటలు మాత్రమే వెలుతురు ఉండే ప్రదేశం లాడాక్. అది కూడా కిలోమీటర్ దూరం కంటే తక్కువే ఉంటుంది పరిసరాలు కనపడదానికి. ఇలాంటి పరిస్థితుల్లో లక్షమంది సైన్యం కి కావాల్సిన ఆహార,ఇంధన,మందులు లాంటి వాటికి రోజుకి వందల కోట్లు ఖర్చు ఉంటుంది. అంటే ఒక బుల్లెట్ కూడా కాల్చకుండా రోజుకి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడమంటే ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో చాలా కష్టమయిన పని. చైనా వ్యూహం ఇదే. నా గత పోస్టులో కూడా వివరించాను యుద్ధం చేయకుండా శత్రు దేశపు ఆర్ధిక వ్యవ్యస్థ మీద ప్రభావం చూపెవిధంగా చైనా తన సైన్యాన్ని మోహరించింది. ఇలా ఇంకో రెండు నెలలు సాగతీస్తే మన మీద ఆర్ధికంగా చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ విషయంలో చైనా విజయం సాధించిందనే చెప్పాలి. అన్నీ వసతులు ఉన్న నగరాలలో రోజూ లక్షమందికి వండి వార్చాలంటే ఎంత వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుందో తెలుసు అలాంటిది చాలా కఠినమయిన వాతావరణ పరిస్థుతులు ఉండే లదాఖ్ దగ్గర అదీ సబ్ జీరో టెంపరేచర్ ఉండే చోట రోజూ లక్షమందికి ఆహారం అందించడం అంటే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి అలాగే వాహానాలలో వాడే ఇంధనం గడ్డకట్టకుండా నిరంతరం వేడిగా ఉండేట్లు చూసుకోవాలి ఎందుకంటే ఏ క్షణంలో అయినా అవి స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిఉంటుంది. ఇదీ చైనా ఎత్తుగడ. మరి దీనికి పరిష్కారం లేదా ? ఉంది. అదే MQ -9 రీపర్ డ్రోన్ [MQ-9 Reaper or Predator-B).

MQ-9 Reaper డ్రోన్ల ని ఆర్డర్ చేసింది భారత ఆర్మీ అమెరికా నుండి. MQ-9 Reaper ఎలా పనిచేస్తుంది ? MQ-9 Reaper అనే ద్రొన్ ప్రపంచెంలోనే డెడ్లీయస్ట్ కిల్లర్ – హంటర్ ద్రొన్ [world’s first mainstream hunter-killer armed UAV] గా పిలవబడుతున్నది. దీనినే MALE [Medium Altitude, Long Endurance] అంటారు. ఇప్పటివరకు అమెరికా బయటి దేశాలలో నిర్వహించిన ఆపరేషన్స్ లో ఒక్క పొరపాటు చేయకుండా అన్నీ ఆపరేషన్స్ ని విజయవంతంగా నిర్వహించింది ఈ MQ-9 Reaper [Predator-B]. డ్రోన్ ఆపరేట్ చేయడమంటే వీడియో గేమ్ ఆడటం లాంటిది కాదు. రీపర్ ఆపరేటర్ ఢిల్లీ లోని కమాండ్ సెంటర్ లో కూర్చొని లడాక్ లోని సరిహద్దుల్లో ఆపరేట్ చేయగలడు. అలాగే ఒకవేళ టార్గెట్ ఐడెంటిఫై అయితే ఢిల్లీ నుండే మిసైల్ ఫైర్ చేసి టార్గెట్ ని నాశనం చేయగలడు. ఢిల్లీలోని ఆపరేటర్ నుండి రీపర్ డ్రోన్ కి సిగ్నల్ వెళ్లడానికి రెండు సెకన్ల సమయం పడుతుంది.

రీపర్ డ్రోన్ ఆపరేషన్ సిగ్నలింగ్ మొత్తం SATcom[Satellite Communication] ద్వారా జరుగుతుంది. ఢిల్లీ లో ఉండే కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుండి మొత్తం ఆపరేషన్ జరుగుతుంది. రీపర్ ద్రోన్ సెమీ అటానమస్ [పాక్షికంగా స్వతంత్రంగా ] తనకి నిర్దేశించిన వే పాయింట్ నావిగేషన్ ద్వారా తానే వెళుతుంది కానీ అవసరం అయినప్పుడు ఆపరేటర్ తన ఆధీనలోకి తీసుకొని సైటిలైట్ ద్వారా దారి మళ్లించి మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. నాలుగు హెల్ ఫైర్ మిస్సైల్స్ [Hellfire Missiles] తో పాటు రెండు 500 lb LGBs[ Laser guided bombs] ని కూడా మోసుకెళ్తుంది. ఇది యుద్ధ విమానం పైలట్ ని ప్రమాదం లో పడేయకుండా [ఒకవేళ గ్రౌండ్ టార్గెట్ కనుక రెండు కొండల మధ్య లోయలో ఉంటే జాగ్వార్ ఫైటర్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ] తానే టార్గెట్ ని నాశనం చేస్తుంది అది కూడా శత్రువు కంట పడకుండా అదీ 50,000 అడుగుల ఎత్తునుండి.

కాపబిలిటీ: ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే అడ్వాంటేజ్ ఉండే పెద్ద విషయం : రికాన్ మిషన్. ఫైటర్ జెట్ లాగా కాకుండా 30 గంటలు ఆకాశంలో అదీ 50,000 అడుగుల ఎత్తులో ISTAR Mission [ Intelligence, Surveillance, Target Acquisition, Reconnaissance] ని నిర్వహించగలుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ శత్రువుల కదలికలని హై రెజోల్యూషన్ ఫోటోలు, వీడియోలు నేరుగా పంపించగలుతుంది అదీ రియల్ టైమ్ లో[శాటిలైట్ ఫోటోలు రియల్ టైమ్ లో పంపించలేదు ]. మొత్తం ఆయుధాల లోడ్ తో అయితే 14 గంటలు ఆకాశంలో ఎగురుతూ అవసరం అయితే తన పే లోడ్ లో ఉన్న హెల్ ఫైర్ మిస్సైల్స్ , లేజర్ గైడెడ్ బాంబులతో దాడి చేయగలదు అది కూడా శత్రువు కంట పడకుండా. ఈ సౌలభ్యం ఫైటర్ జెట్స్ తో ఉండదు.

గ్రౌండ్ సపోర్ట్ డ్యూటీ అయితే రాత్రంతా ఆకాశంలో ఎగురుతూ ఉండగలదు అలాగే తెల్లవారగానే దాడులు చేసి సురక్షితంగా వెనక్కి వచ్చేయగలదు. అవసరం అయితే రాత్రి పూట కూడా దాడి చేయగల సామర్ధ్యం ఉన్నది. టార్గెట్ ని గుర్తించడం అలాగే దాడి చేయడం కూడా చాలా ప్రిసైజ్ [ఖచ్చితంగా ] ఉంటుంది.
900 hp టర్బో ప్రాప్ ఇంజిన్ తో నడిచే రీపర్ డ్రోన్ చాలా నిశ్శబ్దంగా ఎగురుతూ శత్రువుల కంట[Undetected] పడకుండా పని చేస్తుంది. గ్రౌండ్ రాడార్లు పసిగట్టలేవు ఎందుకంటే 50,000 అడుగుల[పాసింజర్ విమానాలు 35,000] ఎత్తులో ఎగురుతూ ఉండడం వలన పైగా అంత ఎత్తులో ఉండడం వలన SAM లు కూడా వెళ్లలేవు. ఇంతవరకూ జరిగిన ఏ మిషన్ లో కూడా రీపర్ డ్రోన్ ని ఎవరూ కూల్చిన ఘటన లేదు అంటే అర్ధమవుతుంది వీటి పని తీరు. అయితే వీటి ప్రధాన ఆపరేషన్ మాత్రం ఎటాక్ చేయడం కాదు శత్రుదేశాల సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న కదలికలని ఫోటో ,వీడియో తీయడమే అవసరం అయితే [అంటే ఒకవేళ అవసరం అనిపిస్తే టార్గెట్ కనుక అదే సమయంలో కనిపిస్తే వెంటనే మిసైల్ ఫైర్ చేస్తారు ].

MQ-9 reaper కి ఉన్న సెన్సార్స్ కి 368 కెమెరాలు ఉంటాయి. వావ్ ! ఒక్కో కెమెరా 5000 మెగా పిక్సెల్ సెన్సార్ ని కలిగి ఉంటుంది [CMOS – Copper Metal Oxide Semi conductor]. ఒక్క నిముషం వీడియొ సేవ్ చేయడానికి 1TB మెమరీ అవసరం అవుతుంది అంటే అవి ఎంత రిజోల్యూషన్ లో ఉంటుందో అర్ధం చేసుకోవాలి. అయితే వాటి రిజోల్యూషన్ ఎంతలా ఉంటుంది అంటే 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ భూమి మీద ఉన్న 6 అంగుళాల ప్రదేశంలో ఉన్న వస్తువుని మనం దగ్గరనుండి చూసినట్లుగా ఫోటో తీయగలుతుంది. ఒకే సమయంలో 60 డిఫెరెంట్ ప్రదేశాలని ఫోటో , వీడియో తీయగలుతుంది. ఒక్కో MQ-9 reaper డ్రోన్ దాదాపుగా 100 km ప్రదేశాన్ని కవర్ చేయగలుతుంది.
MQ-9 reaper రియల్ టైమ్ లో ఇచ్చే ఫోటో,వీడియో లని పరిశీలించడానికి 60 మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు కావాల్సి ఉంటుంది ఎందుకంటే వాటిలో ఏది ముఖ్యమయిన టార్గెట్ ఉందో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రమే గుర్తుపట్టగలరు. ఈ లెక్కన ఒకే సారి ఓ పది ద్రోన్లు ఆకాశం లో ఎగురుతూ శత్రు స్థావరాల వివరాల ని పంపిస్తుంటే ఎంతమంది మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు కావాల్సి వస్తుందో ? కేవలం MQ-9 reaperల కోసమే ఒక ప్రత్యేక కమాండ్ సెంటర్ పెట్టాల్సి ఉంటుంది అంటే వీటి ప్రాధాన్యం ఎలాంటిదో అర్ధం చేసుకోండి.

లదాఖ్ దగ్గర కొండల మధ్య లోయల్లో మనకి కనపడకుండా లోయ అంచుల్లో దాక్కున్నట్లుగా చైనా తన బేస్ కాంప్ లని నిర్మించింది. అక్కడ ఏం జరుగుతుందో చూడాలంటే శాటిలైట్ ఇమేజెస్ మీద ఆధారపడాల్సిందే కానీ అవి రియల్ టైమ్ ఇమేజేశ్ కావు ఇంకా శాటిలైట్ లని మభ్య పెట్టడానికి కేవలం బేస్ కాంప్ లాగా డూప్లికేట్ ఆకారాలని కడతారు కాబట్టి ఏది ఆసలయిన బేస్ కాంపో తెలుసుకోవడం కష్టం. MQ-9 reaper కనుక వస్తే మనకి రియల్ టైమ్ ఫోటోలు వస్తాయి కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవాలో వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు.

ఇక MQ-9 reaper లు కనుక ఆపరేషలోకి వస్తే మొత్తం లక్షల మంది సైనుకులని సరిహద్దుల్లో ఉంచాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే చైనా ఒక రోజు లక్షమంది సైనుకులు లని అక్కడ ఉంచి మరుసటి రోజు వాళ్ళలో సగం మందిని వెనక్కి తిప్పి పంపేసి మనల్ని గందరగోళం లో పెడుతున్నది. సరిహద్దుల్లో కొద్ది మంది సైనికులనే ఉంచి మిగతా వాళ్ళని లేహ్ కి దగ్గరలో ఉంచి MQ-9 reaper ఇచ్చే సమాచారం తో కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లోకి తరలించవచ్చు. దీర్ఘ కాలంలో ఖర్చు కలిసి రావడమే కాక ఈ విషయంలో చైనా,పాకిస్తాన్ ల మీద పై చేయి సాధించవచ్చు. ఒకవైపు చూస్తే మన చేత ఖర్చు పెట్టిస్తున్న చైనా విజయం సాధించినట్లే ఇంకో వైపు ఒక్కో ఆయుధం మనం సమకూర్చుకునేలా చేస్తున్నందు వల్ల మనం కూడా విజయం సాధిస్తున్నట్లే. ఎటూ MQ-9 reaper లు డబ్బులు ఉన్నప్పుడూ కొందాంలే అని అనుకోని కూడా ఇప్పుడే కొనడానికి తప్పని సరి చేస్తున్నది చైనా. ముందు ముందు ఇది చైనాకే నష్టం అన్న లాజిక్ ని ఎందుకు పట్టించుకోవట్లేదో ? ఇప్పుడున్న ఆర్ధిక పరిస్తితి వల్ల మోడీ MQ-9 reaper లు కొనలేడని తప్పుడు అంచనా వేసిందా ? కోరి కొరివితో తల గోక్కున్నట్లు లేదూ ? MQ-9 reaper ల వల్ల POK వైపు కూడా గట్టిగా ఒక చూపు చూడవచ్చు. ఎన్ని గేమ్ చెంజర్లు ఉంటాయండి అని అడక్కండి. పాకిస్తాన్ ఇప్పుడు లెక్కలో లేదు కాబట్టి మన దృష్టాంతా చైనామీదే కానీ ఇప్పుడు కొంటున్న అన్నీ ఆయుధాలు పదేళ్ళ క్రితమే కోనాల్సినవి కానీ ఆలస్యం చేశారు అనే బదులు మన సరిహద్దులని నిర్లక్షం చేశారు అనాలి అందుకే కొనే ప్రతీ ఆయుధం గేమ్ చెంజర్ అవుతున్నది.