ప్రధాన ప్రతిపక్షం..వాడి వేడి తగ్గుతున్నదేంటబ్బా…

190

(నిమ్మరాజు చలపతిరావు)
కారణాలేమైనా రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల పెంపుతో అతి సామాన్య, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు కుదేలవుతున్నాయి .2004-2014 మధ్యకాలంలో ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సమస్యలు…. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు చివరకు పెట్రోలు, డీజిల్ ధరలు ఏమాత్రం పెరిగినా నేతలు రోడ్డెక్కే వారు.. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు… ఆ తర్వాత శ్రీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసమంటూ మిత్రపక్ష బిజెపి తో ముఖ్యంగా ప్రధాని శ్రీ నరేంద్రమోడీ పై రాజీలేని పోరు సాగించారు …..అలాంటి టిడిపిలో నాటి వాడి…. వేడి కనిపించడం లేదు…. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను జగన్ ప్రభుత్వం తూచతప్పక అమలు చేస్తున్నది…. ఉదాహరణకు ఉచిత వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు… అలాగే ఉత్పత్తి …పంపిణీ ఖర్చులన్నీ సబ్సిడీ లేకుండా నేరుగా వినియోగదారులపై భారం పడనున్నదంటున్నారు.ఇక ఒకవైపు కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ …వంటగ్యాస్ పై కొంతకాలంగా సబ్సిడీ తగ్గిస్తుంటే రాష్ట్రం cng గ్యాస్ పై సెస్… మద్యం వ్యాపారం….. రిజిస్ట్రేషన్ చార్జీల భారం…. దశలవారీ రైల్వే స్టేషన్ లలో యూజర్ చార్జీల విథింపు… ఇలాంటి పరిణామాలతో నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కుతున్నాయి… టమాటాలు… ఉల్లిపాయలు…. కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు పత్రికా ప్రకటన లకే పరిమితమవుతున్నారు.. అసలు దీనికి కారణం లేకపోలేదు వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చి కీలక పోస్టులను ఇట్టే అందిపుచ్చుకుంటూ అధికారం అధికారం కు అలవాటు పడ్డారు.. అధికారం లేనప్పుడు తమ వ్యాపారాల కోసం అధికార పక్షానికి ఏదోవిధంగా దగ్గరయ్యే ప్రయత్నం… ఇటీవల జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు అద్దం పడుతున్నది.. అసలు 40 శాతం ఓటర్ల మద్దతు కలిగిన “టిడిపి” గడిచిన 16 మాసాలుగా కేంద్ర రాష్ట్రాల పై ఎందుకు ప్రత్యక్ష పోరు సాగించడంలేదన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న …
దీనికితోడు ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు దాదాపు హైదరాబాద్ లో స్థిరపడి టెలీ కాన్ఫరెన్స్ లకు పరిమితం అవుతుంటే నేతలు ఓ వైపు తమ తమ వ్యాపారాలు ఇతరత్రా స్వార్థ ప్రయోజనాలు లేదా అరెస్టులు ,కేసులకు భయపడుతుంటే….. సామాన్య మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం కై చిన్నా చితక పార్టీలు మినహా ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు రోడ్డెక్కుతుందా అని చూడటం మినహా చేసేది ఏముంటుంది…. కొసమెరుపు… టిడిపికి ప్రస్తుతం రాజధాని భూముల సమస్య మినహా మరొకటి కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…..