అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ కళ్యాణ రధం ని అగ్ని కి ఆహుతి చేసిన చర్యలు వల్ల మన ప్రాంత ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఈసమస్యతో. ఈ ప్రాంతంలో వెలుగు చూడని ఎన్నో సమస్యలు బయట పడతున్నాయి.
1. అసలు ఈసమస్య బాధ్యత ప్రభుత్వ అధికారులు దే.కేవలం వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని ఇక్కడ వారు అంతా అనుకొంటున్నారు.
2. ఇక్కడ మామూలుగా భక్తులకు రధం ముందున్న సిమెంటు రోడ్డు మీద రాత్రంతా పడుకుని ,తెల్లవారు జామున లేచి సముద్ర స్నానం చేసిన పిదప. స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్ళటం అలవాటు.
అటువంటప్పుడు ఈసంఘటన జరగడానికి ముందు నాలుగు రోజుల నుండి అక్కడ ఎవరి నీ ఆరోడ్డుమీద పడుకోవడానికి అనుమతించలేదని చెబుతున్నారు.
3. అలాగే ఇద్దరు వాచ్ మేన్ లలో ఎవరూ అక్కడ లేకపోవడం
4.కళ్యాణ రధం ని ఫోకస్ చేసిన రెండు కెమెరాలు పని చేయకుండా పోవడం…

ఇక్కడ పరిపాలన వ్యవస్థ ఎంత దారుణంగా తయారయ్యిందంటే , ఇదే దేవుని ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పెద్ద ప్లెక్సీ ని దుండగులు చింపివేయడం జరిగింది అటువంటి దుండగులు ఇంతవరకు పట్టుకోలేదు.
అలాగే మూడు నెలలు క్రితం దేవాలయం ప్రక్కనే ఒక మోటారు వాహనం దొంగతనం. జరితే అదికూడా పరిష్కరించబడలేదు.
ఇవన్నీ కేవలం ఇక్కడ వున్న అధికారులు అలసత్వం. నావెనక పెద్దలు వున్నారు నాకేంటి అనే అలసత్వం.
వీటన్నిటి వెనుక ఏదో కుట్ర కోణం వుందేమో అనే అనుమానం ఎక్కువ అవుతుంది.
ఎందుకు అంటే స్వామి వారి వెలకట్టలేని ఆస్తులు ఎవరి ఆధీనంలో వున్నాయో……..

ఈ ప్రాంతంలో ఎన్నో వేల ఎకరాల భూముల అగ్రవర్ణ భూస్వాములు కభందహస్థాలకు ఎలా వెళ్ళాయో ఆలోచన చేయాలి..
1.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 990 ఎకరాలు
2.అంతర్వేది శివాలయం. 360 ఎకరాలు
3.శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం 70 ఎకరాలు
4.గుడిమూల శ్రీ క్రతక్రుత్య రామలింగేశ్వర స్వామి బూములు. 1890 ఎకరాలు
5..శివకోటి శివాలయ బూములు. 250 ఎకరాలు
6 శంకరగుప్తం ఆలయ బూములు 260 ఎకరాలు
7.ఎ.ఎప్.డి.టి.కాలేజీ కి విరాళాల రూపంలో వచ్చిన 200 ఎకరాలు
8.1926-27 ప్రాంతంలో సఖినేటిపల్లి ,మలికిపురం మండలాలలో రైల్వే లైన్ కు ఇచ్చిన 450 ఎకరాలు .
9. ఈప్రాంతంలో ఎక్కువగా వున్న యస్.సి సొసైటీలకు ఇచ్చిన సుమారు 6000 ఎకరాల భూములు
ఇంకా ఎన్నో పేదలకు చెందిన భూములు ఎలా అగ్ర వర్ణ పెద్దలు ల, సామ్రాజ్యవాదులు వారి అనుంగుల కభందహస్థాలకు బలైపోయిన చరిత్ర లను కూడా సి బి ఐ వంటి సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపినప్పుడే ఇక్కడ దేవుళ్ళకు పేద వారికి న్యాయం జరగవచ్చు అనే అభిప్రాయం లో ఇక్కడ వారు ఉన్నారని గ్రహించాలి.
అసలు రాజోలు లో దళిత ,వెనుక పడిన వర్గాల కు మంచి పేరు వస్తే ఓర్చుకోలేని ఒక వర్గం ,దానికి నాయకత్వం వహిస్తున్న ఒక అగ్రకుల వ్రుద్ధ నేత ,వారి సామాజిక వర్గానికి చెందిన ఉభయగోదావరి జిల్లాలోని నేతలు వారి కోటరీ లో పనిచేసే ఇప్పటి రాజోలు నియోజకవర్గ దళిత నేత రాజోలు నా గడ్డ , నా అడ్డా అని చెప్పే పెద్ద బి సి.నేత ,రాజోలు ఎల్లలు తెలియని ఒక మహిళా నేత. పైవారి ఎజండా అమలు చేయడం క్రింది ముగ్గురు పని.దానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పైవారి ద్యేయం ఒకటే యస్ సి. బి సి లను. నామరూపాలు లేకుండా చేయడమే. ఇవన్నీ ఈక్రింది తరగతులు వారు ఎప్పటికీ తెలుసుకుంటారు….???

చాలా చిత్రమైన పరిస్థితి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ రధం కొంత మంది రాజకీయ అగ్ర నేతలు సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారని పిస్తుంది. ఆర్థిక నిబంధనలు ప్రకారం ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ నిభందనల ప్రకారం ఏవస్తువైనా కొనాలంటే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలు కమిటీ తో పరీక్షలు జరిపి తదుపరి సేకరణ పనులు చేపట్టాలని చెబుతోంది.
ఇవన్నీ త్రోసిరాజని ప్రభుత్వం నడిపే కొంతమంది పెద్దలు ఈ నిభందనల ను ప్రభావితం చేసే విధంగా ముందు గానే కలప లాంటి వి సెలక్ట్ చేయడం. అంతర్వేది రధం కుట్ర లో క్రొత్త కోణాలు ఉన్నాయి అనేది ఆలోచించండ
అలాగే ఇక్కడ ఈ దేవాలయం లో అనాదిగా అన్ని కార్యక్రమంలో స్ధానిక నాయకులు ముఖ్యంగా అగ్ని కులక్షత్రియుల భాగస్వామ్యం తో జరిగేవి. ఎందుకంటే సుమారు 200 వందల ఏళ్ల క్రితం ఈదేవాలయం కొప్పనాతిక్రిష్టమ్మ. ( అగ్నికులక్షత్రియులు) గారిచే పునర్మితమైనదనే నమ్మిక భలీయంగా వుంది. మరి అటువంటి వి ఏమీలేకుండా కనీస ప్రభుత్వ ఆదేశాల కు వ్యతిరేకంగా. ఆర్థిక (CODE) ప్రమాణాలు లకు వ్యతిరేకంగా ,టెండర్లు పిలవకుండా ,కలప నాణ్యతా ప్రమాణాలు తిలోదకాలు ఇచ్చి పనులు ప్రారంభించారు.

-విజయ్ కుమార్

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner