ఇక సెలవు…

728

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు మన దేశంలో 90 వేలకు పైగా మంది మరణించారు. ఇక తాజాగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ వైరస్ కారణంగా మృతి చెందారు. దాదాపుగా 40 రోజులుగా ఈ వైరస్ తో పోరాడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూశారు. అయితే ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు.అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు . అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. గత 40 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం కాసేపటి కింద విషమించడంతో మరణించారు. అయితే ఎస్పీబీ మరణం అభిమానులను అలాగే సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.