ఉత్తరాంధ్ర గుండెలాంటి విశాఖ తెలుగుదేశం పాలనలో విశ్వవిఖ్యాతి గాంచింది.
హైటెక్ సిటీకి పునాదులేసి విజనరీ చంద్రబాబు సైబరాబాద్ అనే మహానగరం ఆవిర్భావానికి కారకుడయ్యారు.
విశాఖని మరో సైబరాబాద్ చేయాలనే లక్ష్యంతో తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు విశేష కృషి చేశారు.
180 కోట్లతో 4 ఎకరాలలో మిలీనియం టవర్స్ నిర్మించారు.
ఫిన్‌టెక్ వ్యాలీ, క్లౌడ్ సిటీ, ఐటీ పార్క్. బ్లాక్ చెయిన్, అదానీ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖని ఐటీ హబ్‌గా మార్చాయి.
విశాఖ రుషికొండ ప్రాంతం ప్రపంచంలోనే ఫిన్టాక్ కి కేరాఫ్ అడ్రస్ చేశారు.
టిడిపి ఐదేళ్ల పాలనలో 118 భారీ పరిశ్రమలు 91,544 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
ఈ పరిశ్రమలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 91,097 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
అలాగే 3,209 ఎంఎస్ఎంఈలు స్థాపనకు చంద్రబాబు సర్కారుకు ప్రోత్సాహం అందించడంతో 61,020 మందికి ఉపాధి దొరికింది.
7 వేల ఎకరాల్లో వైజాగ్-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.
విశాఖ నగరం నడిమధ్యలో 34 కోట్లతో సెంట్రల్ పార్క్ ను అభివృద్ధి చేశారు.
విశాఖ నగరంలో 700 కోట్లతో భూగర్భ కేబుల్ లైన్ పనులు పూర్తి చేయడంతో విశాఖ అందాలు మరింత పెంపొందాయి.
ముడసర్లోవ రిజర్వాయర్ నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటు ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నాంది పలికారు.
పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న కైలాసగిరిని సందర్శించే దేశవిదేశ పర్యాటకులకు తెలుగువాడి ఘన చరిత్ర, వారసత్వాన్ని చాటి చెప్పే లక్ష్యంతో రూ.12.50 కోట్లతో కైలాసగిరిలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు.
కైలాసగిరిని ఆనుకుని 2.10 కి.మీ. పొడవునా.. రూ. 7.30 కోట్లతో హెల్త్ ఎరినా ఏర్పాటు చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం.
విశాఖ-భీమిలి బీచ్ రహదారిని విస్తరణతో సాగరతీరం అందాలు మరింత ఇనుమడించాయి.
హుద్ హుద్ హుంకరించి అందాల విశాఖని అస్తవ్యస్తం చేస్తే అనతికాలంలోనే అందాల విశాఖగా తీర్చిదిద్దిన ఘనత దార్శనికుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే.
అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూ, బ్రిక్స్ సదస్సు, మూడుసార్లు భాగస్వామ్య సదస్సులకు వేదికగా విశాఖనే చంద్రబాబు నిర్ణయించడంతో అందాలనగరం పేరు ప్రపంచదేశాలలో వినుతికెక్కింది.
భీమిలిలో రూ.3.84 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం క్రీడలకిచ్చే ప్రాధాన్యతని తెలుపుతోంది.
కేంద్రంతో పోరాడి మరీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ని సాధించడం చంద్రబాబునాయుడికే సాధ్యం.
వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో ఏపీ మెడ్‌టెక్ జోన్ ని నాడు చంద్రబాబు ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఏర్పాటు చేశారు.
దేశంలో మరెక్కడా లేని ఈ మెడ్‌టెక్ జోన్లో తయారయ్యే కోవిడ్ టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్యపరికరాల కోసం దేశమంతా మనవైపే చూసేలా చేయడం ముమ్మాటికీ చంద్రబాబు ఘనతే.
కుర్సురా జలాంతర్గామికి తోడు పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా టీయూ-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం టిడిపి హయాంలోనే ఏర్పాటైంది.
విశాఖ ఉత్సవ్, అరకు బెలూన్ ఫెస్టివల్, వైజాగ్ యాచింగ్ ఫెస్టివల్స్ నిర్వహణతో పర్యాటక రంగానికి ఊతమిచ్చారు.
వీసీఐసీ పారిశ్రామిక వాడ, మెట్రో రైల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్, గంగవరం ఎల్ ఎన్టీ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయము విశాఖకి రావడానికి ఐదేళ్లలో చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిది.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో హుదుద్తో కకావికలమై కూడా కోలుకుని వాణిజ్యరాజధానిగా, ఐటీహబ్‌గా వెలుగొందిన విశాఖ నేడు పాలనా వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాల కబంధ హస్తాలో చిక్కి విలవిల్లాడుతోంది. కబ్జాలు, బెదిరింపులు, నేరాలమయంగా మారింది. వరుస ప్రమాదాలతో మరణమృదంగం మోగుతోంది.16 నెలల పాలనలో విశాఖలో 70 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన అదానీ డేటా పార్క్ ని తరిమేసారు అదే ప్రాంతంలో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కడుతున్నారు జగన్.కాండ్యూయెంట్,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి సంస్థలను మెడపట్టి గెంటేసారు జగన్.చంద్రబాబు హయాంలో ఆర్థిక రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారుల ద్రుష్టిని ఆకర్షించింది విశాఖ.అలాంటి అభివృద్ధి చెందిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేస్తున్నా అని మాయ చేసి బొమ్మ చూపిస్తూ ఉత్తరాంధ్ర యువత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసింది వైకాపా ప్రభుత్వం.
రాష్ట్రమంటే ప్రేమ, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో పనిచేసిన విశాఖని విశ్వవిఖ్యాతగా మార్చిన చంద్రబాబు ఓ వైపు…
విశాఖపై పగతో విద్వేషమే లక్ష్యంగా, భూముల దందా కోసమే రాజధాని పేరుతో రాక్షస రాజకీయాలకు తెరతీసిన జగన్ రెడ్డి మరో వైపు..
విశాఖ వాసులారా మీరెటు వైపు…
