మాకు జీవనోపాదులు కల్పించండి–వ్యభిచారం మానుకొంటాము

564

– సెక్స్ వర్కర్స్ వేడుకోలు

కోవిడ్-19 మహమ్మారి వల్ల గుంటూరు జిల్లాలోని వివిధ వ్యభిచార గృహాలలో  మ్రగ్గుతున్న మహిళలు ( సెక్స్ వర్కర్స్) లలో 75 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు అందిస్తే తాము శాశ్వితంగా వ్యభిచార కూపం నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నరని రాష్ట్ర సెక్స్ వర్కర్స్ ఫోరం – విముక్తి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసుకొంది.

కోవిడ్ లక్డౌన్ వల్ల మార్చి నెల నుంచి తమ ఉపాది అవకాశాలు కోల్పోయామని తమ వద్దకు కస్టమర్లు రాకపోవడంతో తమ కుటుంబాలు పోషించుకునే స్తోమత లేకపోవడంతో తమ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే వుండటం, అలాగే ఇతర ప్రత్యామ్న ఉపాది అవకాశాలు లేకపోవడంతో తమ మనుగడ కోసం పూర్తిగా అధిక వడ్డీలతో రుణాలు తీసుకుంటూ జీవనం గడుపుతూ రావడంతో సెక్స్ వర్కర్స్ వ్యభిచార వృత్తి ని పూర్తిగా వదిలివేసి ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చేపట్టడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారు.

సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్రం లో పనిచేస్తున్న ఇటీవల హెల్ప్ సంస్థ, రాష్ట్ర సెక్స్ వర్కర్స్ ఫోరం విముక్తి సంయుక్తంగా గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని వ్యభిచారంలో మ్రగుతున్న 230 సెక్స్ వర్కర్ల కుటుంబాలతో ఇటీవల్ ఒక శాంపిల్ సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో దాదాపుగా 80 శాతం సెక్స్ వర్కర్లు తాము ఈ వృత్తిని వదిలి తిరిగి సమాజంలోకి వస్తామని అయితే తమకు తగిన ప్రత్యామ్యాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. వీరిలో షుమారు 70% సెక్స్ వర్కర్లు తమకు ఆదాయం వచ్చే మరో దారి లేక తాము, తమ బ్రోతల్ ఓనర్స్, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రేట్లకు 5 శాతం నుంచి 15 శాతం వరకు వడ్డీకి రుణాలు తీసుకున్నామని ఫలితంగా వారి వేధింపులు కూడా భరించాల్సి వస్తోందని ఆందోళనలతో కూడిన ఆవేదనతో ఈ సర్వే లో వెల్లడించారు.

వీరిలో సుమారు 60 శాతం మంది కరోనా మహమ్మారి ముందు నుంచే తాము వ్యభిచారం వల్ల వచ్చే ఆదాయం తమ కుటుంబ పోషణ, ఆర్థిక అవసరాలకు సరిపోవడం లేదని…..అలాగే మరో ఆసరా, ప్రత్యామ్నాయం లేకనే కష్టమో, నష్టమో ఈ వ్యబిచారంలో మ్రగ్గవల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఈ సర్వీ లో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 25 నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఉన్నారు. మీరు అనేక సామాజిక,ఆర్థికకారణాలు, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది బలవంతంగా ప్రలోభాల వల్ల మోసపోయి తమ 18 సంవత్సరాల వయసు లోనే ఈ వృత్తిలోకి దింపబడ్డారు.

చదువు లేకపోవడం,దారిద్ర్యం, పేదరికం వల్ల మేము మోసపోయి వ్యభిచారంలోకి నెట్టబడి, ఇతర అవకాశాలు ఉద్యోగ ఉపాది చేపట్టే తగిన నైపుణ్యాలు లేక ఈ ఊబిలోనే కొనసాగుతున్నామని, అయితే గత 7 నెలల కాలంలో మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా మా పిల్లలు, కుటుంబం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయ జీవనోపాదుల కోరుకుంటూ ఈ వ్యభిచార కూపం నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాము అని పలువురు సెక్సవర్కర్లు కన్నీళ్లతో వేడుకుంటున్నారని విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి హసీనా, ILFAT (India Leaders Forum Against Trafficking) రాష్ట్ర నాయకురాలు శ్రీమతి మున్నేసా తెలిపారు.

ఈ సర్వే లో పాల్గొన్న వీరిలో 90 శాతం మంది తిరిగి ఈ వృత్తిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదు. అయితే దారిద్య్రం, అప్పులు, ఆకలి, భయం అలాగే అప్పుల వాళ్ళ బ్రోతల్ ఓనర్ల ఒత్తిడి గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు. వీరిలో దాదాపుగా పది శాతం మంది మరో రెండు ,మూడు నెలలు పోతే తిరిగి వ్యభిచారం పుంజుకుంటుందని నమ్ముతుండగా 90 శాతం మంది ప్రభుత్వం తమను ఆదుకుని ఉపాది అవకాశం కల్పిస్తే తాము శాశ్వతంగా ఈ వృత్తిని వదిలేసి ప్రత్యామ్నాయ జీవనోపాదులు చేపడతామని అంటున్నారు.
హెల్ప్ సంస్థ రాష్ట కోర్దినటార్ శ్రీ భాస్కర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని వ్యభిచారంలో మ్రగ్గుతున్న మహిళలు నేడు పునరావాసం కోరుకుంటున్నారని కాబట్టి కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వాలు తక్షణమే వారికి వేశ్య వృత్తి లోని మహిళలు,అలాగే అక్రమ రవాణా బాధిత మహిళల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి నుంచి వీరికి సహాయం అందించి వారికి ఇప్పటివరకు ఉన్న అధిక వడ్డీ రుణాలు చెల్లించుకొనేలా చేసి మరో కొత్త జీవితం ప్రారంభం కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

బాధిత మహిళల రాష్ట్ర సమైక్య రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి హసీనా, శ్రీమతి మెహరునిషా మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది సెక్స్ వర్కర్లు జీవనోపాధి కోల్పోయారని వారిని ఆదుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసినందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధితుల మహిళలకు పునరావాసం నిధి నుంచి సహాయం అందించి వ్యభిచారంలో ఉన్న బాధిత మహిళలకు ప్రత్యమ్నాయ జీవనోపాదులు చేపట్టేలా చూడాలని కోరారు.

ఈ విషయమై మేము విముక్తి ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే రాష్ట్ర స్థాయి అధికారులను స్వయంగా కలసి వినతిపత్రాలు అందించామని కానీ మా కన్నీళ్ళు వాళ్ళను కరిగించ లేక పోయాయి అని అంటూ మేము రెండు రోజుల్లో స్థానిక శాసన సభ్యులు, మంత్రులను కూడా కలిసి బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడమని కోరుతున్నారు.