దుర్గమ్మ సన్నిధిలో తరచూ వివాదాలేనా???

642

తెరపడే దెన్నడు??
రాష్ట్రంలో టీటీడీ తర్వాత అతి పెద్ద ఆలయం విజయవాడ శ్రీ కనక దుర్గ ఆలయం అక్కడ సైద్ధాంతిక వివాదాలు అయితే, ఇక్కడ చిల్లర నేరాలు …పాలకులు ఎవరైనా దుర్గమ్మ సన్నిధిలో తరచూ వివాదాలు, ఆ పై విమర్శలు ప్రతి విమర్శలు,ఆరోపణలు ప్రత్యారోపణలు వీటన్నిటి మీద భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. తొలిసారిగా టిడిపి హయాంలో 1998 జరిగిన దోపిడీ కలకలం రేపింది .నాటి గుంటూరు ఎంపీ శ్రీ రాయపాటి సాంబశివరావు తయారు చేయించిన బంగారు కిరీటంతో పాటు కొన్ని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. కేవలం నాలుగు మాసాల వ్యవధిలోనే సీఐడీ అధికారి శ్రీ సీహెచ్ చక్రపాణి ఈ కేసును సవాల్ గా తీసుకుని వేలిముద్రల సహాయంతో గజదొంగ సాహూ ని పట్టుకొని చోరీ సొత్తును స్వాధీన పరుచుకోవడం తో కథ సుఖాంతం అయ్యింది. ఆ తర్వాత తరచూ ముఖ్యంగా చీరల అపహరణ ,హుండీ ల లెక్కింపు లో హస్తలాఘవం, టికెట్ల సైక్లింగ్ నుంచి చెప్పులు భక్తుల సామాగ్రి అపహరణ వంటి నేరాలు జరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు యాభై లక్షల వ్యయంతో ఇంద్రకీలాద్రి ఎగువ నుంచి దిగువ వరకు నిరంతరము పర్యవేక్షించే 130 సిసి కెమెరాలు ఏర్పాటు అయ్యాయి .అయితే నేమి విలువ ఎంతైనా కానీ ఏకంగా వెండి రథంపై మూడు స్తంభాలపై ఉన్న వెండి ప్రతిమలు చోరీకి గురికావడంతో మళ్లీ కలకలం రేపింది. ఈ ప్రాంత శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఏది ఏమైనా ఈ చోరీ వ్యవహారం గుడి పాలకవర్గం, ప్రభుత్వానికి ముఖ్యంగా పోలీసు శాఖకు ప్రతిష్టాకరంగా పరిణమించింది..

– నిమ్మరాజు చలపతిరావు