లోకేష్ సంత‌కం..అంతా జ‌గ‌న్ నాట‌కం

346

ఫైబ‌ర్ నెట్…భార‌త్ నెట్ కి తేడా తెలియ‌ని సాక్షి గొర్రెలు
పంచాయ‌తీల‌కు ఇంట‌ర్నెట్ అందించే ఎంవోయూ
ఎంవోయూ కోసం ఐటీ శాఖాధికారులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమ‌తి సంత‌కం చేసిన ఐటీ మంత్రి లోకేశ్‌
సంత‌కం దొరికింద‌ని స్కాం కోసం వెతుక్కుంటున్న జ‌గ‌న్‌రెడ్డి టీమ్‌

ఒక ఫైలు మొద‌లు చివ‌ర చూడ‌కుండా నారా లోకేశ్ సంత‌కం దొరికింది క‌దా బుక్ చేద్దామ‌నే ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వంతో మూర్ఖంగా దిగిన జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న విష‌పుత్రిక సాక్షి అడ్డంగా బుక్ అయ్యింది. చివ‌రికి ఏపీ ఫైబ‌ర్ నెట్‌కి, భార‌త్ నెట్‌కి తేడా తెలియ‌ని కొండ ఎర్రిగొర్రెలైపోయారు జ‌గ‌న్‌రెడ్డి ఆయ‌న శ‌కుని బృందం. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఐటీ టెలికాం మంత్రిత్వ‌శాఖ‌లో భార‌త్ నెట్‌కి సంబంధించి వివిధ రాష్ట్రాల‌తో ఒప్పందం జ‌రిగింది. దీనికి సంబంధించిన ఎంవోయూ చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లే ఐటీ అధికారుల‌కు ఐటీ శాఖామంత్రిగా త‌న ఆమోదం తెలుపుతూ నారా లోకేశ్ సంత‌కం చేశారు. ఈ సంత‌కం ప‌ట్టుకుని ఏపీ ఫైబ‌ర్‌గ్రిడ్ పెట్టుబ‌డులు మౌలిక‌శాఖ‌లోద‌ని, అది సీఎం చంద్ర‌బాబు ద‌గ్గ‌ర వుంటే.. ఆ ఫైలు బ‌ల‌వంతంగా లాక్కుని నారా లోకేశ్ సంత‌కం చేశార‌ని..త‌మ‌కు దొరికిన సంత‌కంతో కొండ‌కి ఈక క‌ట్టి లాగింది సాక్షి. అటువైపు కొండ రాలేదు కాని ఈక‌లు ఊడి త‌ల‌బొప్పి క‌ట్టింది.

దేశ‌మంతా ప‌ల్లెల‌కు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో మొద‌టి నేష‌న‌ల్ ఆప్టిక్ ఫైబ‌ర్ నెట్‌ వ‌ర్క్ గా మొద‌లై..ఆ త‌రువాత‌ భార‌త్ నెట్ వ‌ర్క్ గా మారింది. ఇందులో భాగంగా 2017లో దేశంలో 2 ల‌క్ష‌ల 50 వేల గ్రామ పంచాయ‌తీల‌కు ఇంట‌ర్నెట్‌, వైఫై సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, దీనికోసం మండ‌లాల నుంచి గ్రామాల‌కు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ (ఓఎఫ్‌సీ) అనుసంధాంచ‌డం ల‌క్ష్యాన్ని అమ‌లు చేయ‌డానికి ఏడు రాష్ట్రాలు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశాయి. దీనిలో భాగంగా బీబీఎన్ఎల్ సంస్థ మ‌రియు యూఎస్ఓఎఫ్ (యూనివ‌ర్స‌ల్ స‌ర్వీస్ ఆబ్లిగేష‌న్ ఫండ్‌) సంస్థ అన్ని రాష్ట్రాల‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కూడా ఒప్పందంకి సంబంధించిన న‌మూనాని పంపించింది. దీనిన‌నుస‌రించి రాష్ట్రం త‌ర‌ఫున రాష్ట్ర ఐటీ సెక్ర‌ట‌రీ, స్టేట్ లెవ‌ల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ (ఏపీఎస్ఎఫ్ ఎల్‌) సంత‌కం చేయాల‌ని కోరారు. ఎంవోయూ చేసుకునేందుకు ఐటీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ విజ‌యానంద్ తాను ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఢిల్లీ వెళ్లేందుకు సంబంధిత శాఖా మంత్రి అయిన నారా లోకేశ్‌ని అనుమ‌తి అడిగారు. ఆ మేర‌కు అనుమ‌తి ఇస్తూ న‌వంబ‌ర్ 13న నారా లోకేశ్ సంత‌కం చేశారు. ఈ సంత‌కం ప‌ట్టుకుని ప్రెసిడెంట్ మెడ‌ల్ తాగిన కొడాలి నానిలా రెచ్చిపోతూ సాక్షి చిందులేస్తోంది. అటు తాను పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రిగా 12918 గ్రామ‌పంచాయ‌తీలకు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు భార‌త్ నెట్ ఒప్పందానికి ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ అధికారులు వెళ్లేందుకు అనుమ‌తిపై సంత‌కం చేయ‌డం ఏ స్కామో సాక్షి, దాని య‌జ‌మాని జ‌గ‌న్‌రెడ్డి చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

టార్గెట్ లోకేశ్‌…అయినా ఏం పీక‌లేరు..

నిర‌క్ష‌రాస్య‌త‌ని కూడా స‌రిగ్గా ప‌ల‌క‌లేని బేగంపేట్ ప‌బ్లిక్ స్కూల్ ఫ‌స్ట్‌క్లాస్ స్టూడెంట్‌.. స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దివి వచ్చినోడి త‌ప్పులు వెతుకుతున్నారు. 43 వేల కోట్లు ప్ర‌జాధ‌నం బొక్కేసి సీబీఐ, ఈడీ కేసుల్లో పీక‌ల్లోతు మునిగి వారం వారం కోర్టుకెళుతూ 11 చార్జిషీట్ల‌లో ఏ1 నిందితుడు అయిన జ‌గ‌న్‌రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కూ రూపాయి అవినీతి లేని నారా లోకేశ్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే వున్నారు. ఇదెలా వుందంటే…దొంగ అయిన జ‌గ‌న్‌రెడ్డి పోలీసుల్ని ప‌ట్టుకుంటాన‌న్న‌ట్టు వుంది. ఇసుక కొర‌త‌కు లోకేశ్ కార‌ణ‌మ‌న్నారు..కాదు చేత‌కాని పాల‌న వ‌ల్ల అని వాళ్లే ఒప్పుకున్నారు. ల‌క్ష‌ల స్నాక్స్ తిన్నార‌ని త‌ప్పుడు వార్త‌లేశారు. 100 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా ఎదుర్కొంటున్నారు జ‌గ‌న్‌రెడ్డి. శేఖ‌ర్‌రెడ్డి లోకేశ్ బినామీ ఆరోపించి…ఇప్పుడు అదే శేఖ‌ర్‌రెడ్డిని తన చంక‌నెక్కించుకున్నారు జ‌గ‌న్‌రెడ్డి. 16 నెల‌ల అధికారం వెల‌గ‌బెడుతూ 40 ఏళ్ల లోపు కుర్రాడైన నారా లోకేశ్‌ని అవినీతిప‌రుడు అని నిరూపించేందుకు ఒక్క ఆధారం సంపాదించలేని చేత‌కాని చ‌వ‌టగా మిగిలిపోవ‌డం జ‌గ‌న్‌రెడ్డికి ఇష్టంలేదు. కానీ వ‌ద‌ల‌దు. ఇంకా నారా లోకేశ్‌ని వెంటాడుతాడు. వేధించాల‌ని చూస్తాడు. జ‌గ‌న్‌రెడ్డి అధికార ‌కాల‌మంతా నారా లోకేశ్‌ని టార్గెట్ చేస్తూనే కాలం గ‌డిపేస్తాడ‌ని అర్థం అవుతోంది. పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, ఒప్పందాల‌లో నిజాయితీ, అవినీతికి తావులేకుండా ప‌ద‌వీకాలంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్న చంద్ర‌బాబు, లోకేశ్‌, టిడిపి మంత్రుల‌ను క‌నీసం ఏం చేయ‌లేమ‌ని డిసైడ్ అయిన …జ‌గ‌న్‌రెడ్డి త‌న మూర్ఖ‌పు ఎత్తుగ‌డ‌ల‌తో ఆరోప‌ణ‌లు చేసి..క‌థ‌నాలు వేసి వ‌దిలేస్తే…చాలు ఎంతో కొంత డ్యామేజ్ చేయొచ్చ‌నే ల‌క్ష్యంతోనే ఇప్ప‌టికీ అదే వ్యూహంతో వెళుతున్నాడనే దానికి మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టిన‌ట్టే ఐటీ శాఖ అధికారి ప‌ర్య‌ట‌న అనుమ‌తికి చేసిన నారా లోకేశ్‌ సంత‌కానికి ఏపీ ఫైబ‌ర్ నెట్ స్కాంకి లింకు పెట్టినట్టే వుంది.

-శ్రీనివాస రెడ్డి,సీనియర్ జర్నలిస్టు