తూ.గో. విలన్ చంద్రబాబు-2

381

ఇసుక బొక్కిన బాబు, గోదావరిలో రుబాబు
-(వేణుంబాక విజయసాయిరెడ్డి)

తూర్పు గోదావరి జిల్లా ఓటర్లు చైతన్యవంతులు. వైఎస్ , జగన్ గారిలకు రెండు సార్లు పూర్తి స్థాయిలో అండగ నిలబడ్డారు. ప్రపంచంలోనే అతి కొద్ది ప్రాంతాల్లో ఉండే వనరులు ఇక్కడ ఉన్నాయి. తూ.గోలో పండని పంట లేదు… దొరకని ఖనిజం లేదు. తీరంలో మత్స్యసంపద, గ్యాస్ అపారం. అలాంటి జిల్లాను ఎంతగా కొల్ల గొట్టాలో అంత కొల్ల గొట్టాడు. తీరంలో గ్యాస్ పైప్ లైన్ లీకైతే ఒక్కనాడు పరిహారం ప్రకటించని నాయకుడు చంద్రబాబు. కనీసం ఆయా కంపెనీలపై ఒత్తిడి తెచ్చి… ఎంతో కొంత బాధితులకు మేలు చేయొచ్చనుకోలేదు.

-ఫిఠాపురం నియోజకవర్గంలో అవినీతిని ప్రోత్సహించాడు చంద్రబాబు. నీరు – చెట్టు పథకం పేరుతో ఈ ఒక్క నియోజకవర్గంలోనే 27 కోట్ల వరకు దోచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పథకాల పేరుతో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు.
-ఈ నియోజకవర్గంలో సెజ్ ల కోసం 12 వేల ఎకరాల భూముల్ని సేకరించినా… రైతులకు సరైన పరిహారమివ్వకుండా దగా చేశాడు చంద్రబాబు నాయుడు. గోదావరి నదిలో ఇసుక తరలింపుపై ఉన్న దృష్టి … పరిహారంపై పెట్టలేదీ విజనరీ.
-కాపులు అధికంగా ఉన్న ఇదే గడ్డపై జగన్ గారు కాపులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. బీసీలకు నష్టం జరగకుండా కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తామని ప్రకటిస్తే… జగన్ గారిని కాపు వ్యతిరేకిగా చిత్రీకరించాలనుకున్నాడు చంద్రబాబు. కల్లబొల్లి కబుర్లు చెప్పి – కాపు ఉద్యమకారుడు ముద్రగడను నిర్భందించి నవ్వులపాలయ్యాడు చంద్రబాబు. కాపులభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలిస్తానన్న బాబు – మాట తప్పి… దానిక్కారణం జగన్ గారేనంటూ నమ్మించాలనుకున్నాడు. అయితే దాన్ని కాపులు తిప్పి కొట్టారు. కాపు సామాజిక వర్గానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది.
-వ్యవసాయం దండగన్న చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో కాలువల ఆధునీకరణ చేపట్టలేదు. బకింగ్ హాం కెనాల్ ను పునరుద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలికిన బాబు – కనీసం పిల్ల కాలువల్లో పూడికలు కూడా తీయని సంగతి తూ.గో. ప్రజలకు తెలియంది కాదు.
-పెద్దపురం నియోజకవర్గంలో యనమల వియ్యంకుడూ నామినేషన్ పద్ధతిలో పనులు తీసుకుని – సబ్ కాంట్రాక్టర్లకు పనులిచ్చి కమీషన్లు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నాడు. అవినీతిని పరుగులు తీయించాడు.
-1915లోనే మున్సిపాలిటీ పెద్దాపురం. రాష్ట్రంలో భీమిలి తర్వాత అత్యంత పురాతన మున్సిపాలిటీగా భాసిల్లినా… చంద్రబాబు ఈ నియోజకవర్గంలో మంచి నీటి సమస్యను కూడా తీర్చలేదు.
-కాకినాడలో రైస్ మిల్లర్లు, రైతుల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు చంద్రబాబు. ఇక్కడ ఎక్కువగా ఉండే మత్స్యకారులు తమ సమస్యలను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా వారిని ఎస్టీల్లో చేరుస్తానంటూ హామీలు గుప్పించి అధికారంలోకొచ్చాక విస్మరించాడు. కనీసం ఒక్కసారైనా ఆ దిశగా చిత్త శుద్ధితో పనిచేయలేదు.
-కాకినాడ స్మార్ట్ సిటీకోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమల్లించాడు. కనీసం ఆ డబ్బుతో నగరంలోని డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరించ లేదు చంద్రబాబు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఆ నిధులను స్కూల్స్, డ్రైనేజీని మెరుగు పరచడానికి ఉపయోగిస్తోంది.
– తూర్పు గోదావరి జిల్లాలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. గోదావరి ప్రజలు సాగునీటి ప్రాజెక్టులు కట్టిన వైఎస్ ను సర్ అర్థన్ కాటన్ లా కొలుస్తారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండబోదు.
-జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండానే ఉంటుంది. కాకినాడ తీరంలోని కోరంగి మడ అడవులకు ఎలాంటి హానీ వైసీపీ ప్రభుత్వం తలపెట్టదు. దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే పేదలకు ముఖ్యంగా మత్స్యకారులకు ఇళ్లు కేటాయించిందీ సర్కార్. పైగా మడ అడవుల పరిరక్షణకు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిందీ ప్రభుత్వం. బాబు చేసే విష ప్రచారాన్ని నమ్మేందుకు ప్రజలు కూడా సిద్ధంగా లేరు.