తూ.గో. విలన్ చంద్రబాబు-1

521

తాండవ నదిని తోడేసిన యనమల బ్రదర్స్.
-(వేణుంబాక విజయసాయిరెడ్డి)

మార్పునకు సంకేతం తూర్పు – గోదావరి జిల్లాల ప్రజలు ఎవరికి పట్టం కడితే వారిదే రాష్ట్రం. అది విభజిత ఆంధ్రాలోనైనా ఉమ్మడి రాష్ట్రంలోనైనా. వైఎస్ఆర్ కుటుంబానికి గోదావరి జిల్లాలంటే ప్రత్యేక అభిమానం. ప్రజలకూ అంతే… వైఎస్ఆర్ లేదా జగన్ గారు పాదయాత్ర గోదావరి బ్రిడ్జ్ దాటేటప్పుడు చూస్తే ఆ అనుబంధం ఎవరికైనా అర్థమవుతుంది. జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు , జెండాను ప్రకటించింది తూర్పు గోదావరి జిల్లాలోనే. పాదయాత్ర చేస్తానంటూ శంఖారావం పూరించిందీ ఇక్కడే. చంద్రబాబు మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో కులాలమధ్య చిచ్చుపెట్టాడు , ఇసుక – మైనింగ్ – కార్పొరేట్ మాఫియాను ప్రోత్సహించాడు. తుని నుంచి రాజోలు వరకు ప్రజలను దగా చేశాడు. తనదైన వెన్నుపోటు రాజకీయాలు నడపడంతోపాటు ఇప్పుడు అంతర్వేది అంటూ అంటించాలనుకుంటున్నాడు. వాటిని ప్రజలెప్పుడూ హర్షించరు. ఆయన దృష్టిలో తూర్పు గోదావరి బీసీలంటే యనమల రామకృష్టుడు ఆయన తమ్ముడు కృష్ణుడు తప్ప మరెవరూ కాదు.

– తాండవ నది ఒడ్డునున్న తునిలో అగ్గి రగిల్చాడు చంద్రబాబు నాయుడు. తాండవ నదిలో వరదలొస్తే తుని కోతకు గురవుతుంది – తన 14 ఏళ్ల పాలనలో వందల సార్లు కరకట్ట కట్టి పట్టణాన్ని కాపాడతానని హామీనిచ్చాడు చంద్రబాబు. ఏనాడూ ఆ హామీని నెరవేర్చలేదు.
– తాండవ నదిలో ఇసుకను తోడేశారు యనమల సోదరులు . ఇసుక మాఫియాను యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ప్రోత్సహించాడు. అంతా కమీషన్ల వ్యాపారమే. ఆ ప్రజా కంటక బ్రదర్స్ వరుసగా ఓడిపోయినా వారికే బాబు పట్టం కట్టి… తునిని సొంత జాగీరుగా చేసేశాడు. ప్రజలను వధించడమే పనిగా పెట్టుకున్నాడు.
– చంద్రబాబు అధికారంలోనున్నప్పుడు తునిలో టీడీపీ జెండా కడితేనే సక్షేమ కార్యక్రమాలకు అర్హులంటూ యనమల బ్రదర్స్ చెలరేగిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలం మంత్రిగా – ఆర్థిక మంత్రిగా ఉన్నా తాండవ నదిపై కరకట్టకోసం రూపాయి కేటాయించలేదు. ఎక్కడ కరకట్ట కడితే తమ ఇసుక దందాకు అడ్డొస్తుందేమోనన్న భయమే దీనికి కారణం.
– తునీలో పౌల్ట్రీ, ఆక్వా బాగా అభివృద్ధి చెందింది… అలాంటి చోటకు చంద్రబాబు బినామీ కెమికల్ కంపెనీలు తెచ్చాడు. దీనివల్ల కాలుష్యం పెరగడంతో… మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. అయినా తనకు డబ్బే ప్రధానమన్నట్లు ప్రవర్తించాడు చంద్రబాబు. తాండవ నదికి రక్షణ గోడ కడతామని 2013 పాదయాత్రలో మరోమారు హామీనిచ్చినా… దాన్ని తన 600 హామీల్లాగే గోదాట్లో కలిపేశాడు బాబు.
– అధికారం అండతో చెలరేగిపోయారు… ఖాళీ స్థలాలను కబ్జా చేశారు యనమల బ్రదర్స్. పోలీస్ స్టేషన్లు, శ్మశానాలు కావేవీ కబ్జాకు అనర్హమనేలా ప్రవర్తించారు. అందుకే వారిని ప్రజలెప్పుడూ గెలిపించకపోయినా … చంద్రబాబు మాత్రం వారిని జనంపై రుద్దాడు. వారిని చూపి మత్స్యకార, శెట్టిబలిజ, పద్మశాలి లాంటి ఇతర బీసీలను మాత్రం అణగదొక్కాడు.
– ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో వంతాడ మైనింగ్ మాఫియాను ప్రోత్సహించాడు చంద్రబాబు. తమకెక్కడ అడ్డు వస్తాడోనని ఇక్కడ గతంలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేను కొనేశాడు చంద్రబాబు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రకృతిని ధ్వంసం చేశాడు.
– ప్రత్తిపాడు నియోజకవర్గంలో తమ మైనింగ్ కు ఎక్కడ అడ్డువస్తారోనని కొండ దొర ఆదివాసీలను తరిమేశారు పచ్చ బ్యాచ్. బాక్సైట్, లేటరైట్ ఖనిజాల కోసం రిజర్వ్ ఫారెస్ట్ ను తవ్వేశాడు చంద్రన్న.
– పోలవరం ప్రాజెక్టు కమీషన్లపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై ఏనాడూ చూపలేదు చంద్రబాబు. తన 14 ఏళ్ల పాలనలో ఆవాసం కోల్పోయిన పేదలకు ఒక్క ఇళ్లు కట్టిన పాపాన పోలేదు. కుటుంబాలను కూల్చే చంద్రబాబుకు గృహాల విలువేం తెలుస్తుంది. ఇలా పోలవరం వల్ల గూడు కోల్పోయిన రంప చోడవరం నియోజక వర్గంవైపు అస్సలు చూడలేదు చంద్రబాబు. అక్కడి ప్రజలు వైఎస్ఆర్, జగన్ లకు పట్టం కట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
– గోదావరి పక్కనే ఉన్నా… రంప చోడవరంలో మంచి నీటి సమస్య వేధిస్తున్నా అటువైపు చూసిన పాపాన పోలేదు 40 ఏళ్ల అనుభవశాలి. గిరిజనులకెందుకు ఆస్పత్రులన్నట్లే ప్రవర్తించాడు బాబు. రంప చోడవరంలో ఆస్పత్రులు, రోడ్లు వేసింది వైఎస్ఆర్. అక్కడ ప్రజలకు కష్టమొస్తే పరామర్శకు వెళ్లింది అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ గారు. విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలినా రంప చోడవరంపైపు చూడలేదు బాబు.
-తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేశారు జగన్ గారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయన ఏం చేసినా తూర్పు గోదావరి నుంచే మొదలు పెడుతున్నారు. అందుకే తూ.గో అభివృద్ధి జగన్ గారి ప్రభుత్వానికే సాధ్యం. అంతేకాదు… వెనుకబడ్డ కులాల్లో అన్ని వర్గాలనూ ప్రోత్సహిస్తూ… అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేస్తున్నారు జగన్ గారు.