-(సత్య, విశ్లేషకుడు)

“తిరుపతి ఎవడమ్మా మొగుడిది ?ఎవరైనా పోవచ్చు.క్రైస్తవుడైన జగన్ రెడ్డి తిరుమలలో “ఎవరమ్మా మొగుడికి డిక్లరేషన్ ఇవ్వాలి? అసలు ఇది పెట్టిందెవడు ? ఏ రాజకీయపార్టీ పెట్టింది ఈ డిక్లరేషన్ విధానం ?” అని అప్పట్లో నవంబర్ 2019 లోనూ, ఇప్పుడూ తెగ చించుకుంటున్నాడు ఒకాయన. ఆయనకితోడు ఇప్పుడు కులజఫ్ఫాలు ! ఆయనతో అలా అనిపిస్తున్నదెవరో కూడా స్పష్టంగా అర్ధమవుతోంది. బహుశా రేపెల్లుండి ఇంకో పాస్టర్ కూడా ఇదే వాదనతో తిరుమలలోకి ప్రవేశించి అక్కడున్న యాత్రికుల్ని ఆశీర్వదిస్తూ పరోక్ష మతప్రచారం నిర్వహిస్తాడేమో.

కింద ఫోటోల్లో ఉన్నది 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం. పిక్చరెస్క్ ఇండియా దాని పేరు. ఇంగ్లండ్‌ నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దార్లో ఉన్న దర్శనీయస్థలాల గురించి ఇంగ్లీషులో రాసిన 650 పేజీల పుస్తకం ఇది. పదో తరగతిదాకా తెలుగు మీడియంలోనే చదువుకున్న నాకు అర్ధమయింది. జఫ్ఫాలు కూడా ప్రయత్నించవచ్చు.

ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను ‘అప్పర్ తిరుపతి’ అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు. ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు.

అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు. పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు. అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.

నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే, ఇప్పుడేం మాయరోగం వచ్చింది ? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది ? ఎవరిని “టేకెన్ ఫర్ గ్రాంటెడ్” గా తీసుకుంటున్నారు ? ఎందుకింత అధికార మదమెక్కింది ? ఒకపక్క హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంకోపక్క మీ ఓటుబ్యాంకుని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నమేగా ఇది ?

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner