అగ్రిగోల్డ్ బాధితుల కడగళ్ళు తీరేదెన్నడు??

299

పాలకులు మారుతున్నా అగ్రిగోల్డ్ బాధితుల కడగండ్లు మాత్రం తీరడం లేదు….
2017 మార్చి 23న నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు శాసన సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అగ్రిగోల్డ్ కంపెనీలు దేశవ్యాప్తంగా 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 6,300 కోట్లు..అందులో ఆంధ్రప్రదేశ్ లో 19 లక్షల మంది నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు సేకరించినట్లు…. 18 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేసినట్లు…. బాధితులందరినీ ఆదుకుంటామని హామీనివ్వడం జరిగింది..ఇక అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటాల ఫలితంగా తొలిగా 2500 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం కై పలు రకాల జీవోలు జారీ అయ్యాయి. హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్న సమయంలో తొలిగా పది వేల రూపాయల లోపు వారికి చెల్లింపుల కై జిల్లా లీగల్ అధారిటీ లలో పేర్లు నమోదు చేసుకోవాల్సిరాగా మూడు లక్షల 70 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు ,వేర్వేరు కారణాలతో మరో మూడు లక్షల మంది నమోదు చేసుకోలేకపోయారు.. ఏది ఏమైనా బాబు హయాంలో ఎలాంటి చెల్లింపులు జరగలేదు. ఇక వైయస్ జగన్ తన ఎన్నికల హామీ ప్రకారం 1150 కోట్లు బడ్జెట్లో కేటాయించారు .ఇప్పటికీ 264 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో మరో పోరాటానికి బాధితులు నడుంకట్టారు .అక్టోబర్ 2వ తేదీ, దసరా,క్రిస్మస్ పర్వదినాల్లో దశలవారీ పంపిణీ చేయాలన్న డిమాండ్ల పై మండల స్థాయిలో ప్రత్యక్ష పోరుకు సన్నద్దమవుతున్నామని సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెబుతున్నారు… దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే…

– నిమ్మరాజు చలపతిరావు