తలుపు వెనుక దాక్కున్న విజయవాడ కనక దుర్గమ్మ

526

విజయవాడలోని ఒక పాఠశాల.దాంట్లో ఒక ఎస్సీ హిందువు అట్టెందర్ గా పనిచేస్తున్నాడు.ఆ పాఠశాల చుట్టూ విస్తరించిన క్రైస్తవ కాలనీలు ఉన్నాయి.వీరందరూ దళిత క్రైస్తవులు. పాఠశాలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో అద్దె ఇంటి కోసం గాలిస్తు న్నాడు. ఇంటి యజమానులు ఒక్కటే ప్రశ్న” మీరు క్రైస్తవులు అయితేనే మా ఇల్లు అద్దెకు ఇస్తాం. పర దేవతలను(సైతానులను) కొలిచే వారికి మా ఇల్లు అద్దెకు ఇవ్వం”.చివరకు ఒక ఇంటి యజమాని ఒక షరతు పెట్టాడు.”మా ఇల్లు అద్దెకు మీకు ఇస్తాను.అభ్యంతరం లేదు.అయితే మీ ఇంట్లో మీ దేవతల ఫోటోలు వాటి పూజ చేయరాదు”.విధి లేక ఆ ఇంట్లో అద్దెకు చేరడానికి అంగీకరించాడు.ఇంట్లో చేరాడు.స్వంత ఇల్లు అయినా,అద్దె ఇల్లు అయినా చేరిన వెంటనే ఉచిత స్థానంలో దేవుని పటం పెట్టీ పూజించడం మన సంప్రదాయం.ఇప్పుడు ఏమి చేయాలి? ఆ ఇంటికి ప్రవేశం ఒకే తలుపు గల ద్వార బంధం.ఆ తలుపు వెనుక తనకు ఇష్టమైన కనక దుర్గమ్మ ఫోటో అతికించాడు.ఆ తలుపు వేసి ఇంట్లోంచి చూస్తే కనక దుర్గమ్మ దర్శనం ఇస్తుంది.బయట నుండి ఎవరైనా వస్తె,తలుపు తీస్తే ఆ కనక దుర్గమ్మ తల్లి కనపడదు,అదృశ్యం అవుతుంది.(తలుపు వెనుక దాక్కొంటుంది)ఎలాగా సవర్నులు ఎస్సీలకు ఇల్లు అద్దెకు ఇవ్వరు. క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలు ఇల్లు అద్దెకు ఇచ్చినా కనక దుర్గమ్మ తల్లిని తలుపు వెనుక దాక్కో పెట్టాలి.విజయవాడ కనక దుర్గమ్మ దివ్య క్షేత్రంలో హిందూ ధర్మాన్ని నమ్ముకున్న ఎస్సీల కష్టాలు.దళిత క్రైస్తవుల నుండి హిందూ ఎస్సీలు ఎదుర్కొంటున్న కష్టాలు వినేది ఎవ్వరు?

-శ్యామ్ ప్రసాద్