నీ నామమెంత మధురమో!

608

చంద్రబాబు

ఆ పేరు తలవకుండా…ఉండలేకపోతున్నారు.

వైసీపి..బీజేపి..ఇంకా ఇతరులు చంద్రబాబు నామం నిత్యపారాయణం చేస్తున్నారు.

మోదీని విమర్శించాడు కాబట్టే ప్రజలు ఓడించారని చెప్పే బీజేపి వాళ్ళు.

జననేత జగనన్న కావాలనుకున్నారు ప్రజలు అని భావించే వైసీపి.

మేధావులు…విశ్లేషకులు.

23…3… దేవుడి వ్రాసిన స్క్రిఫ్ట్ అన్నారు.

మరెందుకు ప్రజల మీద పగబట్టారు.

చంద్రబాబు చచ్చిన పాము అన్నారు .
ఎందుకు ఆయన్ని తలుచుకుని ఉలిక్కిపడుతున్నారు..!?

పదేపదే ప్రజలు తిరస్కరించారంటున్నారు..మరి ప్రజలు తిరస్కరించిన వాడు…చిత్తుగా ఓడిన వాడి పట్ల భయం ఎందుకు!?

ఏభై శాతం ఓట్లంటే రాష్ట జనాభా మూడింట రెండొంతులు మీ వెంట ఉన్నట్టే..!

మరెందుకు..ఇలా పరిపాలన చేస్తున్నారు…!?

ఎందుకు పోలీసులతో నిర్భంధం చేస్తున్నారు…అణచివేత ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు.!?

అసలు రాజధాని ప్రాంతంలో టీడీపి గెలవాలి లెక్కప్రకారం అక్కడి ప్రజలు కూడా వైసీపిని గెలిపిస్తే వారి మీద ప్రేమ రెట్టింపై చంద్రబాబుని మరచి పోయేలా అమరావతిని అభివృద్ది చేయాలి..!

పట్టిసీమ నీటితో డెల్టా రైతులు పండించుకోగలిగారు..
అక్కడ కూడా వైసీపీ గెలుపు …మరి ఆ ప్రజల పట్ల కోపం ఉండరాదు కదా!

కమ్మసామాజిక వర్గం ప్రధాన ఓటు బేంక్ గా ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపి ఘనవిజయం సాధించింది..!

మరి ఇంకా కమ్మ ద్వేషం ఎందుకు…!?

ఎవరు గెలిచినా ఐదువేలు తేడా ఉండే…జమ్మలమడుగు లో ఏభై వేల మెజారిటీ ఎలా సాధ్యమయింది…!?

హోదా అడగలేక పోవచ్చు..విభజన హామీలగురించి ఒత్తిడి చెయ్యలేక పోవచ్చు…!

కాని వచ్చిన పెట్టుబడులను ఎందుకు పోగొట్టాలి..!?

అభివృద్ది విషయం ఎందుకు వదిలేయాలి!?

తనకు వెన్నంటి ఉన్న దళిత సమాజం పట్ల ఎందుకు ద్వేషం..ఎందుకు వారి పై గతంలో ఎన్నడూ జరగనంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి!?

అన్ని ప్రాంతాల్లో అప్రతిహత విజయం సాధించిన జగన్ గారు ఎందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు!?

మతద్వేషాలు ఏనాడూ ఆంధ్ర ప్రాంతం లో లేవు…
క్రైస్తవం లో దళితులు మాత్రమే కాదు..అన్ని కులాల వారు..ఉన్నారు.

ఎప్పుడూ ఎవరూ ద్వేషించుకోలేదు…!

ఇవాళ కొత్తగా మతపర ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి!?

మంచి విజయం చేకూరింది…
హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా పాలన సాగించవచ్చు..!

కాని ఎందుకు ప్రతిరోజు అడ్డగోలు నిర్ణయాలు!?

బడుగు బలహీన వర్గాలు..పేదవారు అండగా నిలవక పోతే ఆ విజయం లభించదు..
మరి ఎందుకు ఇసుక పాలసీ తో వారి పొట్టగొట్టారు..!?

అలాగే అన్ని వర్గాలు…వ్యాపారులు..కాంట్రాక్టర్లు..రియల్టర్లు ..మద్యం వ్యాపారుల అండ లేక పోతే…ఇంత ఊపు రాదు….
మరి ఎందుకు రావటం రావటం వారి మీద బండపడేసారు..!?

ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు…ప్రజావ్యతిరేక నిర్ణయాలు గా నిర్దారించబడుతున్నాయి…!

చకచక పనులు సాగే పోలవరాన్ని ఎందుకు పడకేయించారు!?

ఇవన్నీ చూస్తుంటే ప్రజల ఓట్ల తో గెలిచినట్టు అనిపించటం లేదు.

ప్రజల అవసరం లేదన్నట్టు ఉన్నది…!

ప్రజల అభిప్రాయం ..మనోభావాలతో పనిలేనట్టు కనపడుతున్నది.

ఇది వరకు ఈవీయమ్ ల మీద అనుమానాలు మాత్రమే ఉండేవి…
ఇప్పుడు వీరి వ్యవహారం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత…వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉన్నది..

పధకాలు..నగదు బదిలీ…కేవలం సంక్షేమం తప్ప ..అదీ కూడా నిర్దేశించి నట్టు ఓటు బాంకు రాజకీయమే కనబడుతున్నది.

అధికారం…అణచివేత..వ్యవస్దల దుర్వినియోగం..కేంద్ర పెద్దల అండ ఉంటే చాలు ఓట్ల తో పని లేదన్నట్టు ఉన్నది.

అంతటి ఘన విజయం సాధించిన తర్వాత..స్దానిక సంస్దల ఎన్నికల్లో నల్లేరు పై బండి నడకలా సాగుతుంది..కాని నామినేషన్లకే అవకాశం ఇవ్వక పోవటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి..!?

అసలు బొమ్మ బయటపడుతుందన్న భయమా!?

నిజానికి 2017 ఆగష్టు లో నంద్యాల ఉప ఎన్నిక నాటికి వైసీపి గ్రాఫ్ గ్రౌండ్ లెవెల్ తాకుతున్నది…
అంతకు ముందు స్దానిక సంస్దల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక లో స్వయంగా వివేకానంద రెడ్డి గారు ఓటమి పాలయ్యారు..

అక్కడ వారి కుటుంబాన్ని ఓడించటం ఎవరి తరమూ కాదు.

ఆ తరువాత వచ్చిన కాకినాడ మున్సిపల్ ఎన్నికలు.. పట్టణ ప్రాంతం..కాపు సామాజిక వర్గం అధికం…అయినా అక్కడ టీడీపి విజయం సాధించింది.

అప్పటికే బీజేపి దూరం జరుగుతున్నది…జనసేన అధినేత ప్రశ్నల పరంపర కొసాగుతున్నది..
మరి ప్రభుత్వ వ్యతిరేకత కనిపించాలి కదా!

సినిమా వాళ్ళు కుల కంపు రేపుతున్నారు…

ఎన్నికల ముందు తుఫానులు…జగన్ గారు తొంగి కూడా చూడలేదు.

నిజమే ! ఎన్నికల ముందు…రావాలి..కావాలి..నేను ఉన్నాను ..నేను విన్నాను ..పాటలు..మాటలు హోరెత్తాయి…ఒక్క ఛాన్సు నినాదం కూడా మారుమోగింది…
కోడికత్తి ..బాబాయి హత్య..డ్రామాలని చిన్న పిల్లవాడికి కూడా అర్దం అవుతుంది.

ఏమో ! ఇవన్నీ జీరో కెళ్ళిన జగన్ గ్రాఫ్ ని నలభై ఏభై సీట్లకు పెంచి ఉండవచ్చు…

అన్ని సీట్లలో సానుకూలత …ప్రధాన ప్రత్యర్ది కాబట్టి ఊపు..జోరు ..హోరు ..జనసమీకరణ కచ్చితంగా ఉంటుంది.

ఇప్పటి వీరి ప్రవర్తన…తుపానుల సమయంలో పట్టించుకోక పోవటం ఇవన్నీ కలిపి విశ్లేషిస్తే…వారికి ముందే తెలుసు ..యంత్రాలే గెలుపిస్తాయని..

లాజిక్ కోసం..మాత్రమే కొన్ని ప్రచారాలు జరిగాయి…కొన్ని ఆరోపణలు చెయ్యబడ్డాయి..కొందరు దూరం జరిగారు…

ఎవరు గెలవాలో…ఎన్ని సీట్లు రావాలో కచ్చితంగా నిర్దేశించ బడింది…

అందుకే…ఇప్పటికీ వారికి చంద్రబాబు పీడకల..నిద్రలో కూడా ఆయన్ని కలవరిస్తారు…

యంత్రాల ధైర్యంతోనే…వాటి సాయం తోనే అధికారంలోకి వస్తామని నమ్ముతున్నారు..

ఇప్పుడు కొత్త లాజిక్ …జనసేన అండ ..కులం మద్దతు …మతం …వల్ల వచ్చామని చెప్పుకోవచ్చు..

యంత్రాలు ని వాడితే..ఆ కిటుకు..ఆ మర్మం ఇంకా వాడుకోగలిగితే…

కాని కాంగ్రెస్ ఇతర పక్షాలకు క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది…ఆ కిటుకు వాళ్ళకు కూడా తెలియవచ్చు.
యంత్రాలు ఏలా వాడబడతాయన్న దానిమీద దేశం రాష్ట్రం భవిష్యత్తు ఆధారపడి ఉన్నది.

ప్లాన్ బీ …చంద్రబాబు శతసహస్ర దూషణార్చన మాత్రం విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

-Adusumilli srinivasarao