పథకాల్లో 85 శాతం హిందువులకే లబ్ధి:రోజా

108

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. కులాన్ని, మతాన్ని జగన్‌కు ఆపాదించటం తగదని విమర్శలకు ఆమె హితవు పలికారు. ఇవాళ స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్‌లను రోజా విరాళంగా ఇచ్చారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ స్ట్రెచర్‌లను విరాళంగా ఇవ్వడం జరిగింది. వీటి అంచనా విలువ రూ 2.00 లక్షలు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు. బీజేపీ, జనసేన ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌పై బురద చల్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అంతర్వేది అంశంలో జగన్ సీబీఐ విచారణకు అంగీకరించారన్న విషయాన్ని రోజా మరోసారి గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన ఆమె.. రెండు చోట్ల ఓడిపోయిన ఆయనకు అంతర్వేది విషయంలో మాట్లాడే అర్హత ఉందా? అని రోజా ప్రశ్నించారు.