మతం రంగేసుకుంటున్న రాజకీయాలు

362

పోలిటికల్ మైలేజికి పోటాపోటీ
అంతర్వేది సంఘనను రాజకీయం చేస్తున్న పార్టీలు
భావోద్వేగాలతో దేశ సమగ్రతకు దెబ్బతిస్తున్న వైనం

అలా వైకుంఠపురములో విష్ణుమూర్తి పాలకడలిపై శేషతల్పం పై లక్ష్మీ దేవి చెంతన ఉండగా దుర్వాస మహముని వైకుంఠ పురంకి వచ్చాడు.తన రాకను గమనించని విష్ణుముర్తిని కాలితో తన్నాడు దుర్వాస మహముని. అప్పుడు విష్ణుమూర్తి ఏమాత్రం కోపం తెచ్చుకోకా చిరునవ్వుతో ఆమహర్షి కాలును చేతిలోకి తీసుకోని ఆయన కాలులో గల కన్నును చిదామి ఆయన గర్వమణిచారు.మరి విష్ణుమూర్తి అంటే దేవుడు అంతటి వాడే తన గుండెలు మీద తన్నినా చిరునవ్వుతో ఆయన గర్వం అణిచాడే తప్ప చేతిలో విష్ణు చక్రం ఉంది కదా అని ప్రయేగించలేదు.మరి ఇక్కడ రోమ్ములు బాదుకుంటు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగోడుతు భారతదేశం లో హైందవ మతంపై దాడిగా వర్ణిస్తున్నారు.దేశభక్తికే ప్రతీకలుగా చెప్పుకునే పెద్ద మనుషులకు దేశమంటే కులమతాలేనా? దేశ మంటే మట్టకాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహకవి గురజాడ.ఉన్న ఉర్లలో ఉపాధిలేక పోట్ట చేత పట్టకు పోయిన ఆ కూలీలు కరోనా మహమ్మారికి తట్టుకోలేక సోంత ఊర్లకు కాలి నడకన బయలుదేరిన వారిని ఆదుకోవాడానికి రాని మనుషులు ఇప్పుడు రాజకీయ మైలేజికి మతం రంగు పూస్తుండటం విచారకరం.హిందు మతసాంప్రదాయంలో సాటి మనిషిని ప్రేమించే గుణం ఉంది. సహనం ఉంది.వీరి మార్చడానికి మరో బుద్దుడు అవతరించాలేమో.ఆనాడు హిందు మతాన్ని పతనావస్థకు చేర్చింది ఇటువంటి పెద్ద మనుషులే.మంత్రం అందరికీ..!.మోక్షం అందరిదీ అష్టాక్షరీ మంత్ర బహిరంగ ప్రకటనతో నరకం ప్రాప్తిస్తుందన్న వారి వాదనను రామానుజులు తోసిపుచ్చారు. అదే నిజమై తాను నరకానికి వెళ్లినా మంత్రోపదేశం పొందినవారు పరమపద అర్హులైతే చాలని భావించారు. అంతే, తిరుకొట్టియూర్‌ ఆలయ గోపురం ఎక్కి ‘ద్వయ మంత్రం’ ప్రకటించారు.మరి రామానుజులవారి వలే అందరి మంచికోరే వారేరి. దేశాన్ని ప్రేమించమనే మనుషులు సాటి మనుషులను ద్వేషించడం ఏంత వరకు సబబు
అంతర్వేదలోని లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్దం కావడం దురదృష్టం సంఘన దోషులను పట్టుకోని శిక్షించవలసిందే కాని ప్రజల భావోద్వేగాలను రెచ్చకోట్టి పబ్బం గడుపుకునే కొంత మంది నాయకులు తయారుకావడం దురదృష్టకరం. వారి ఏత్తుగడలను తిప్పికోట్టవలసినదిగా కోరుచున్నాము.

ఎ.వి.వి.శ్రీనివాసరావు,
జర్నలిస్ట్,విజయవాడ.