తలకాయ లేని ముఖ్యమంత్రి కేసీఆర్

614

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తలకాయ లేని ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు బీజేపీ దమ్మేంటో చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీకి టీఆర్ఎస్ నేతల గుర్తింపు అవసరంలేదని, ప్రజలే కేసీఆర్‌ను మర్చిపోతున్నారని తెలిపారు. తన కుటుంబానికి చరిత్రలో స్థానం కోసమే విమోచన దినం జరపటంలేదని తప్పుబట్టారు. అమరుల చరిత్రను తుడిచేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, కేసీఆర్.. ఓవైసీ కుటుంబం మోచేతి నీళ్ళు తాగుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పార్టీ మద్దతు లేదనడం సరికాదని బండి సంజయ్ అన్నారు.