దేవాలయాల పరిరక్షణకు దీక్ష…

1
30

కె. రఘురామకృష్ణంరాజు , నర్సాపురం పార్లమెంట్ సభ్యులు

ధార్మికతకు, మత సామరస్యతకు పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.ముఖ్యంగా ఈ దాడుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, పిచ్చివాళ్ల పని అంటూ కొట్టిపారవేయడం, బాధితులపై ఎటువంటి చర్య తీసుకొనే ప్రయత్నం చేయక పోతూ ఉండడంతో హిందువుల మనోభావాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయి.దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులతో కలత చెందిన నేను గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు ఈ దీక్ష చేయతలపెట్టాను.
దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని , రాష్ట్ర ప్రభుత్వంను కోరడం కోసమే ఈ దీక్షను నిర్వహిస్తున్నాను.

దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇటువంటి దాడులను అడ్డుకోని పక్షంలో రాష్ట్రంలో ప్రజల మధ్య మతసామరస్యం దెబ్బతిని, అశాంతి రాజుకొనే అవకాశం ఉంటుందనే ఆందోళనయే నన్ను ఈ దీక్ష జరపడానికి ప్రేరేపిస్తుంది. ఆ విధంగా జరిగితే రాష్ట్రాభివృద్ధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.అంతర్వేదిలో దగ్ధమైంది.. కేవలం స్వామివారి రథం కాదు ఐదుకోట్ల ప్రజల మనోరథాలు .రథం దగ్ధం కావడం చాలా దారుణమైన సంఘట. 62 ఏళ్ల చారిత్రగలస్వామివారితో అనుబంధం ఉన్న రధం, లక్షలాదిమంది భక్తులు తరించే రధం . అలాంటి రథాన్ని దారుణంగా దగ్ధం చేయడాన్ని చాలా బాధపడుతున్నారు.అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యం కానీ కారణాలు చెబుతున్నారు.‘ఆలయాల పరిరక్షణలో నిర్లిప్తత… కాలయాపనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే అసలు దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. మతిస్థిమితం లేనివారి చర్య అని ఉదాసీనంగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటున్నారా?కరోనా విపత్తు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారు. వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బ తిన్నాయో ప్రభుత్వం గ్రహించాలి’ .దేవాలయాలకు సంబంధించిన రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం ఒక్క నిర్దిష్టమైన విధానాన్ని పాటించాలి. దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలి.అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి రథం దగ్ధం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.మంత్రి వెల్లంపల్లి మతి లేకుండా మాట్లాడుతున్నారు.

గత సంవత్సరకాలంలో వరుసగా మొత్తం 15 దేవాలయాలపై దాడులు జరిగాయి. పిఠాపురం, కొండబిట్రగుంట, ఇప్పుడు అంతర్వేదిలలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇవి యాధృచ్ఛికంగా జరిగినవి కావని స్పష్టం అవుతుంది. ఇటువంటి సంఘటనలను మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటూ ఒక విధంగా సమర్ధించే ప్రయత్నం చేయడం నవ్వులాటగా కనిపిస్తున్నది.తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందించి ఉంటె తిరిగి ఇటువంటి సంఘటన జరిగి ఉండేదా అని ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. వరుస సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పెద్దలు మద్దతుతోనే అవి జరుగుతున్నట్లు భక్తులు భావించే పరిస్థితి ఏర్పడుతున్నది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జరుగుతూ ఉండడం, హిందూ దేవాలయాల భూములపై పలుకుబడి గలిగిన వారు కన్నేసి కైవసం చేసుకొనే ప్రయత్నం చేస్తుండడం గమనిస్తే ఈ దాడులు ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు వెల్లడి అవుతుంది.దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. వాటిపట్ల తగు రీతిలో వ్యవహరించని పక్షంలో వారి మనోభావాలను గాయపరచిన్నట్లు కాగలదు. ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు నేడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగు నష్ట నివారణ చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితులు అనూహ్యమైన మలుపు తీసుకొనే అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఇటువంటి సంఘటనల పట్ల దైవంపై నమ్మకం లేని వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ వంటి ప్రభుత్వాలు సహితం ఉదాసీనంగా వ్యవహరించ లేక పోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తున్నది.

సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠంలో ఈ సంఘటనల పరంపర ప్రారంభమైనది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు.నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. ఇట్లా వరుసగా సంఘటనలు జరుగుతున్న సమాధానం మాత్రం ఒకే రకంగా ఉండడంతో, అవ్వన్నీ ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, ఇక సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వివాధాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రమైన అంశంగా పరిగణించి, తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందువుల మనోహభావాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. టిటిడి భూములను అమ్మివేసే ప్రయత్నం జరిగినప్పుడు ప్రజలనుండి పెద్ద ఎత్తున ఎదురైనా ఆగ్రవేశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి, ఆ మొత్తం పక్రియను రద్దు చేయడంతో ఒక పెద్ద ఉపద్రవాన్ని నివారింప గలిగారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. లేని పక్షంలో పరిస్థితులు అదుపు తప్పవచ్చనే ఆందోళన కలుగుతున్నది.

అంతర్వేది వద్ద భారీ సంఖ్యలో హిందూ సంస్థలకు చెందిన వారు ఆగ్రవేశాలతో దేవాలయంను చుట్టుముట్టితే మంత్రులు లోపల గంటలపాటు నిలబడవలసి రావడం గమనిస్తే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేని పక్షంలో రాగాల తీవ్ర పరిణామాలకు సంకేతం ఇచ్చిన్నట్లయింది.కేవలం హిందూ మతం విషయంలో మాత్రమే ప్రభుత్వం స్పందించడం లేదని అభిప్రాయం ప్రజలలో బలంగా నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ మతంపై చెందినవైనా ప్రార్ధనా మందిరాల పట్ల ప్రజల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది.ప్రభుత్వం కేవలం ఒక ప్రత్యేక మతంపై చెందిన వారిని ఆదరిస్తూ మిగిలిన వారి పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నదని అభిప్రాయం కలగడం ఏ లౌకిక ప్రభుత్వంకు కూడా మంచిది కాదు. రాజకీయంగా తీవ్ర మూల్యాన్ని చెల్లించే పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని దేశంలో నేడు పలు చోట్ల జరుగుతున్న పరిణామాలను చూసైనా గ్రహించాలి.చెప్పుకోదగిన ఆస్తులు, ఆదాయాలున్న దేవాలయాలను ఎంపిక చేసి, వాటి లక్ష్యంగా దాడులు జరుపుతూ, వాటిని కైవసం చేసుకొనే ప్రయత్నం రాజకీయ నాయకత్వం మద్దతుతోనే జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ప్రజలలో అనుమానాలు చెలరేగడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

ముఖ్యంగా హిందూ దేవాలయాలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. పైగా తిరుమల వంటి దేవాలయాల నిధులను ప్రభుత్వం తీసుకోవడం జరుగుతున్నది. పైగా వాటి నిర్వహణలో రాజకీయంగా పెత్తనం చేసే ప్రయత్నం జరుగుతున్నది. మరే మతానికి చెందిన ప్రార్ధన ఆలయాల విషయాలలో ప్రభుత్వం ఆ విధంగా జోక్యం చేసుకోగలదా?వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలి.

1 COMMENT