హన్నా… ‘సోమన్న’ను అంతలేసి మాటలంటారా?

చిరంజీవి సీఎం కావాలంటారా? .. హమ్మా?
కులాభిమానం ఉండనిదెవరికి హర్షన్నా..?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)
‘బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కాపు కులాభిమానం ఎక్కువ. చిరంజీవి కుటుంబానికి ఆయన హన్మంతుడు లాంటోడు. చిరంజీవిని సీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ ద్వారా కాపులను రెచ్చగొడుతున్నారు’
– ఇది కులాలకు అతీతంగా, దేశమే ప్రాణంగా బతికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ఆరోపణ.
పార్టీలు మారకుండా బీజేపీలో ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అయిన సోము వీర్రాజును పట్టుకుని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా? ‘భాజపా కులం గురించి ఎప్పుడూ ఆలోచించదు. దేశం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. వైసీపీ రెడ్ల పార్టీ. టీడీపీ కమ్మ పార్టీ. అవి కుటుంబపార్టీలు. రాజశేకర్‌రెడ్డి గారబ్బాయి జగన్మోహన్రెడ్డి. చంద్రబాబునాయుడు గారబ్బాయి లోకేష్‌బాబు. కానీ మాది కుల పార్టీ కాదు’ అని అప్పటికీ సోమన్న చెవినిల్లుకట్టుకుని చెబుతూనే ఉన్నా, హర్షకుమార్ వినకపోతే ఎలా? కమలం అంటే పులుకడిగిన ముత్యమని చెబుతుంటే వినరేం?.. అన్నది సోము అభిమానుల వాదన.
అవునండీ.. వీర్రాజన్నకు చిరంజీవి అంటే మహా ఇష్టం. ఒక్క వీర్రాజన్నకేంటీ.. లక్షలాదిమంది కాపులకు అన్నయ్య అంటే ప్రాణం. చొక్కాలు చించుకునేంత ఇష్టం. అందుకే సోమన్న అధ్యక్షుడయిన తర్వాత.. సొంత పార్టీ వాళ్లను కూడా కలవకుండా.. చిరంజీవి అన్నయ్య కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయకపోయినా సరే.. హైదరాబాద్ వెళ్లి, మొట్టమొదట చిరంజీవినే దర్శించుకుని అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటే తప్పేమిటి? అసలు దానివల్ల మీకు వచ్చే నష్టమేమిటి? ఆయన చిరు కుటుంబానికి హన్మంతుడి లాంటి వాడే అనుకోండి. ఇద్దరూ తూ.గో.జి- ప.గో.జి వాళ్లాయె! ఆ మాత్రం రిలేషన్సు ఉండకూడదా ఏంటీ?
అయినా సాటి కులస్తుడిపై, ఆపాటి ప్రేమానురాగాలు ఉండటంలో తప్పేమిటి? అవును. చిరంజీవి కాపు నాయకుడే. వీర్రాజు కూడా కాపు నాయకుడే. అయితే ఏంటి? పార్టీకి కులం కన్నా దేశమే ముఖ్యం కావచ్చు. కానీ, ముందు మనం మనుషులం. తర్వాతే పార్టీ నాయకులం కదా? ఆ లెక్క ప్రకారం కులాభిమానం ఉంటే తప్పేమిటి? ఆ మాటకొస్తే మీకు మాత్రం కులాభిమానం లేదా ఏంటీ? మీరు మాత్రం దళిత సంఘాలకు నాయకత్వం వహించడం లేదా ఏంటీ? దళిత కార్డు వాడటం లేదా ఏంటీ? మరి క్యాస్టు కార్డుల విషయంలో, మీకో న్యాయం మాకో న్యాయమా? ఇది రొంబ అన్యాయం కదూ’ అని వీరన్న వీరాభిమానులు.. హర్షకుమార్‌పై కారాలు మిరియాలు నూరిపోస్తున్నారు.
పైగా.. రోజూ టీడీపీని-చంద్రబాబును వీరన్న చెడుగుడు ఆడుతున్నా, ఇప్పటివరకూ తెలుగుదేశపోళ్లు కూడా తమ నాయకుడిని అన్నేసి మాటలు అనలేదని.. అలాంటి సొంత తూ.గో.జి వాడయిఉండీ, హర్షకుమార్ అంతలేసి మాటలనడం ఏమిటని.. సోమన్న అభిమానులు తెగ కుమిలిపోతున్నారు. తూ.గో. జిల్లా టీడీపీ నేత నిమ్మకాయ చిన రాజప్ప మాత్రం మొన్నామధ్య, సోము వీర్రాజు-జీవీఎల్-విష్ణువర్దన్