వడియంపేట వాసులను పరామర్శించిన కలెక్టర్ చంద్రుడు

442

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వడియంపేటవాసులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

ప్రమాదంలో గాయపడ్డ వారి ప్రాణాలు కాపాడేలా అత్యవసర వైద్య సేవలందించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ కు కలెక్టర్ ఆదేశం

అనంతపురం నగరంలోని డీమార్ట్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వడియంపేటవాసులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ప్రాణాలు కాపాడేలా అత్యవసర వైద్య సేవలందించాలని కలెక్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ ను ఆదేశించారు.

గురువారం మధ్యాహ్నం వడియం పేట గ్రామానికి చెందిన కూలీలు పనులు ముగించుకొని తిరిగి ఆటోలో స్వగ్రామం వెళ్తుండగా డీ- మార్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 6 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతరం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. అత్యవసరంగా వైద్య సేవ లందించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ,మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.గాయపడ్డ వారి బంధువులను పరామర్శించి, భయపడ వద్దని, మంచి వైద్య సేవ లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ధైర్యం చెప్పారు..

1 COMMENT