భారత్‌ వైమానికి దళంలోకి రఫేల్

359

నేడు భారత్‌ వైమానికి దళంలోకి రఫేల్‌ యుద్ధ విమానం చేరనుంది.అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఇవాళ ఇండక్షన్ సెర్మనీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఫేల్ విమానాలను ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో డిస్ప్లే చేశారు. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్‌అండ్‌డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్ననున్నారు. కాగా ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్స్‌‌ నుంచి మొదటి దశలో ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరిన విషయం తెలిసిందే.