ఎల్‌ఏసీ దగ్గర యుద్దవాతావరణం

605

ఎల్‌ఏసీ దగ్గర చైనా చర్యలతో యుద్దవాతావరణం కనిపిస్తోంది.సరిహద్దుల్లో చైనా బుసలు కొడుతోంది. భారత సరిహద్దుకు కేవలం అరకిలోమీటర్ దూరంలో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. భారత్ చైనాకు యుద్ధం జరిగితే ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలి,అవి ఎలా ఉపయగించాలి అనేదానిపై శిక్షణ ఇస్తుంది.అంతే కాకుండా లడఖ్ కు అతి సమీపంలో యుద్ధవిమానాలను మోహరించింది.H-6బాంబర్లను సైతం రంగంలోకి దింపి భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విన్యాసాల్లో అణుబాంబులను జారవిడిచే ఫైటర్‌ జెట్‌లను కూడా వినియోగిస్తూ శిక్షణను ఇస్తోంది. ఇక డ్రాగన్ చర్యలకు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమౌతోంది. లఢక్ లో డ్రాగన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతోంది.భారత ఆర్మీ  సుఖోయ్‌, మిగ్‌ విమానాలను సరిహద్దుల్లో మోహరించింది. ఇక తాజాగా రాఫెల్ జెట్ యుద్ధవిమానాలను రంగంలోకి దింపుతోంది.