చేనేత‌ల్ని ఆదుకోలేని ప్ర‌భుత్వ‌నేత‌లెందుకు?

583

నేత‌న్ననేస్త‌మంటూనే రిక్తహ‌స్తం
ఒక్కో చేనేత కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి
చేనేత ప్ర‌తినిధుల‌తో వెబినార్‌లో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

చేనేత కార్మికులు నానా ఇబ్బందులు ప‌డుతుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి క‌నీసం ప‌ట్టించుకోవాల‌న్నా ఆలోచ‌న‌లో కూడా లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేనేతల స‌మ‌స్య‌లపై వివిధ చేనేత సంఘాల ప్ర‌తినిధులు, నేత‌ల‌తో బుధ‌వారం టిడిపి కేంద్ర కార్యాల‌యం నుంచి వెబినార్ నిర్వ‌హించారు. టిడిపి అధికార ప్ర‌తినిధి, చేనేత‌ల ఇంటి బిడ్డ పంచుమ‌ర్తి అనూరాధ చేనేత‌ల స‌మ‌స్య‌లపై ఆన్‌లైన్ స‌మీక్ష స‌మావేశానికి అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. సంద‌ర్భంగా టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మాట్లాడుతూ చేనేతలకు సంబంధించిన సమస్యల గురించి పూర్తిస్థాయిలో అధ్య‌యనం చేశాన‌ని, క‌ష్టాల‌లో వున్న చేనేత ప‌రిశ్ర‌మకు క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల విధించిన లాక్‌డౌన్ కాలం శాపంగా మారింద‌న్నారు. మ‌రోవైపు వ‌ర్షాల‌తో ఉన్న స్టాక్ అమ్ముడుపోలేద‌ని దీంతో ఇటు ప‌రిశ్ర‌మ‌లు, అటు కార్మికులు తీవ్రంగా న‌ష్టపోయార‌న్నారు. లాక్ డౌన్ కారణంగా నష్టాలు ఎదుర్కొన్న చేనేత కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాల‌ని, చేనేత‌ల‌లో 10 శాతం మందికే ఇచ్చిన నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అంద‌రికీ వ‌ర్తింప‌జేయాల‌ని డిమాండ్ చేశారు. అర్హులైన ప‌థ‌కం అంద‌ని వారి జాబితా త‌యారుచేసి ప్ర‌భుత్వం ముందుంచి న్యాయం కోసం పోరాడ‌తామని పిలుపునిచ్చారు. అమ్ముడుపోని స్టాక్‌ని ఆప్కో ద్వారా కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. మూడు నెల‌ల‌కోసారి రాష్ట్ర‌వ్యాప్తంగా వున్న‌ చేనేతల‌ స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. గ‌త 15 నెల‌ల్లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌ 50 మంది చేనేత కార్మికుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని మౌనం పాటించారు.

చేనేత‌కు చంద్ర‌న్న చేయూత‌
-టిడిపి అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనూరాధ

కరోనాతో చేనేత రంగం దాదాపు రూ.2వేల కోట్ల వరకు నష్టాలు చవి చూసింద‌ని, ప్రభుత్వం నుండి కనీసం సహకారం కూడా అందలేద‌ని టిడిపి అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనూరాధ ఆరోపించారు. టిడిపి హ‌యాంలో 111 కోట్ల చేనేత‌ల రుణాలు మాఫీ చేశార‌ని, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చార‌ని, నూలు, రంగులపై 30శాతం సబ్సిడీ అందించామ‌ని, చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, రంగుల కోసం రూ.25 కోట్లు, పావలా వడ్డీ ద్వారా రూ.2కోట్ల రుణాలు, మూల ధనం కింద రూ.30 కోట్ల సాయం, మర మగ్గాలకు 50 శాతం రాయితీ ద్వారా రూ.80 కోట్లు ఖర్చు, 50 సంవత్సరాలకే పెన్షన్, 1.11లక్షల చేనేత కారులకు పెన్షన్లు ఇచ్చామ‌ని తెలిపారు. పనులు ఉండని వర్షాకాలంలో నెలకు రూ.4వేల చొప్పున భృతి కల్పించిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌న్నారు. రాష్ట్రంలో 3.30లక్షల మంది చేనేతలుంటే.. 81వేల మందికి నేత‌న్న నేస్తం ఇస్తామ‌ని, చివ‌రికి 74వేల మందికి ఇచ్చార‌ని పేర్కొన్నారు.

వైఎస్ చేనేత‌లకు ఉరి..జ‌గ‌న‌న్న నేత‌న్న‌కు రిక్త‌హ‌స్తం
-మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప
తండ్రి వైఎస్ హయాంలో వెయ్యి మంది వరకు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నార‌ని, ఒక్క‌రినీ ఆదుకోలేద‌ని, ఇప్పుడు త‌న‌యుడు జ‌గ‌న్ రాజకీయ కక్షతో నేతన్న నేస్తం పథకాన్ని కొంద‌రికే ఇచ్చి మోస‌గిస్తున్నార‌ని మాజీ మంత్రి నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఆరోపించారు. లాక్ డౌన్ సమయంలో పనులు లేకపోవడం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మగ్గాలు విప్పి పక్కన పెట్టినవారికి కూడా పథకం మంజూరు చేయ‌క‌పోవ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీ హ‌యాంలో చేనేత‌ల ప‌రిస్థితి దుర్భ‌రం
-వావిలాల సరళా దేవి
వైసీపీ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో చేనేతల ప‌రిస్థితి దుర్భ‌రంగా మారింద‌ని వావిలాల స‌ర‌ళాదేవి ఆందోళ‌‌న వ్య‌క్తం చేశారు. గతంలో వర్షాకాలంలో నెలకు రూ.4వేల చొప్పున ఆర్ధిక సాయం అందేద‌ని, ప్రస్తుతం ఆ పథకం నిలిచిపోయింద‌న్నారు. చేనేతల ఆత్మ‌హ‌త్య‌ల వెనుక‌ వాస్తవాలను బయటపెట్టకుండా తొక్కిపెడుతున్నార‌ని ఆరోపించారు. కార్మికులంతా కూడా పని కల్పించాలని కోరుతుంటే.. ఆర్ధిక సాయం అంద‌జేస్తున్నామ‌ని స‌రిపెట్టుకోమ‌న‌డమేనా చేనేత‌ల ప‌ట్ల స‌ర్కారు చిత్త‌శుద్ది అని ప్ర‌శ్నించారు.

చేనేత‌లు టిడిపి మ‌ద్ద‌తుదారుల‌నే జ‌గ‌న్ వివ‌క్ష‌
-మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్‌ గంజి చిరంజీవి

చేనేత కార్మికులు మొద‌టి నుంచీ టిడిపి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నే కార‌ణంతోనే జగన్ రెడ్డి సర్కారు కక్ష క‌ట్టింద‌ని మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్‌ గంజి చిరంజీవి ఆరోపించారు. క‌రోనా కార‌ణంగా చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు ఉపాధి లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంటే..ఆదుకోవాల్సిన స‌ర్కారు..రూపాయి సాయం చేయ‌కుండా…కోట్ల రూపాయ‌లు మీడియాకి ప్ర‌క‌ట‌న‌లు ఇస్తుండ‌డం చేనేత‌ల‌పై జ‌గ‌న్‌రెడ్డి చూపేది స‌వ‌తిత‌ల్లి ప్రేమేన‌ని మ‌రోమారు స్ప‌ష్ట‌మైంద‌న్నారు. అంద‌రికీ నేత‌న్న నేస్త‌మ‌ని ప్ర‌క‌టించి..మ‌గ్గాలుంటేనే అని మెలిక‌పెట్టి..10 శాతం మందికే ప‌థ‌కం ఇవ్వ‌డం 90 శాతం మంది కార్మికుల‌కు అన్యాయం చేయ‌డ‌మేన‌న్నారు.

4 ల‌క్ష‌ల మంది చేనేత‌ల దుర్భ‌ర ప‌రిస్థితి
-గుత్తికొండ ధనుంజయ రావు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేనేత రంగం దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటోంద‌ని గుత్తికొండ ధ‌నుంజ‌య‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో 65లక్షలకు పైగా ఉన్న చేనేతల్లో 4 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నార‌ని, వారికి క‌నీస సాయం కూడా అందించ‌క‌పోవ‌డం స‌ర్కారు నిర్ల‌క్ష్య‌వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. షెడ్డు కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయకపోవడం అత్యంత దుర్మార్గ చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. క‌రోనాకు ముందు నేసిన రూ.100 కోట్లు, స‌హ‌కార‌రంగంలో మరో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉన్నా కొనే నాథుడు లేక చేనేత‌లు ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్యం అవుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేనేత సహకార బోర్డును రద్దు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రబుత్వం కనీసం నోరెత్తకపోవడమేంట‌ని ప్ర‌శ్నించారు.

చేనేత‌ల‌కు టిడిపి చేయూత
-మోడం నాగరాజు
కరోనా కష్ట కాలంలో చేనేతలకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ భావించడం సంతోషకరమైన విష‌యమ‌ని మోడం నాగ‌రాజు త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్ని ప‌థ‌కాలు అంద‌రికీ అందిస్తే.. నేడు నేతన్న నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చి, వాలంటీర్లతో కేవలం తమ పార్టీకి అండగా ఉన్న వారికే అమలు చేయ‌డం వివ‌క్ష నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

సొసైటీలు నిర్వీర్యం చేస్తున్న స‌ర్కారు
-బొడ్డు వేణుగోపాల రావు
ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలతో సొసైటీలు అన్నీ నిర్యీర్యం అయిపోతున్నాయ‌ని బొడ్డు వేణుగోపాల రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేనేతలు పడుతున్న కష్టానికి, వారికి అందే పరిహారానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసం నెలకొంద‌న్నారు. చేనేతలకు అండగా నిలిచే సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం జగన్ రెడ్డి దుర్మార్గ పూరిత వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమ‌న్నారు.

చేనేత‌ల‌కు ప‌థ‌కాలు కావాలంటే వైసీపీలో చేరాల‌ట‌!
-ఎం.దేవేంద్ర నాథ్
పెన్షన్లు, నేతన్న నేస్తం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని దేవేంద్ర నాథ్ మండిప‌డ్డారు. అదే సమయంలో సొసైటీల్లో చేరాలి, వైసీపీకి మద్దతు తెలపాలి అంటూ స్థానిక నేతలు, వాలంటీర్లు వేధించడం అత్యంత దుర్మార్గమైన చ‌ర్య‌ని దేవేంద్ర‌నాథ్ ఖండించారు.

జ‌గ‌న్ హ‌యాంలో చేనేత‌రంగం నిర్వీర్యం
-అందేకోటి వీరభద్ర రావు
1982కి ముందు రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఏ విధమైన అవస్థలు పడుతున్నారో.. నేడు అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నార‌ని అందే కోటి వీర‌భ‌ద్ర‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో జనతా వస్త్రాలు అనే పద్దతి కారణంగా చేనేతలు తిరిగి వృత్తుల్లోకి వచ్చారు. కానీ.. నేడు జగన్ అధికారంలోకి వచ్చాక రూ.24వేలు చేతికిచ్చి వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో అర్హుల్లో చాలా మంది చేనేత‌ల‌కు ప‌థ‌కాలు అంద‌లేద‌న్నారు.

ప‌థ‌కాలంద‌లేద‌ని నిల‌దీస్తే దాడులు
-మడక రాజా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సొసైటీల్లో 3.50 లక్షల మంది కార్మికులుంటే… 80వేల మందికి మాత్రమే నేత‌న్న నేస్తం పథకం అమలు చేశార‌ని, వీటిని ప్రశ్నిస్తే అరెస్టులు, వేధింపులు, దాడులు చేస్తున్నార‌ని మ‌డ‌క రాజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.