వడ్డీతో సహా చెల్లించి తీరుతాం:నారా లోకేష్

239

మాజీమంత్రి కొల్లు రవీంద్ర ను పరామర్శించిన నారా లోకేష్

విజయవాడ కరెన్సీ నగర్ లో కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన లోకేష్

లోకేష్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

టిడిపి నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మరెచ్చిపోయేది లేదు

వడ్డీ తో సహా చెల్లించి తీరుతాం

రెట్టింపు వేగంతో ముందుకెళ్తాం

ప్రజల తరఫున ప్రభుత్వం పై యుద్ధం చేసేవారిని జగన్ జైళ్లో పెట్టిస్తున్నారు

16నెలల నుంచి అధికారంలో ఉన్నారు. మా హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా?

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు

రానున్న రోజుల్లోనూ వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది

మంత్రులందరికీ అసహనం పెరిగిపోయింది

సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి అసహనంతో మాట్లాడుతున్నారు

జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని మంత్రులు చంద్రబాబు పేరు జపిస్తున్నారు

నిద్రలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు చంద్రబాబే వైకాపా నేతల కలలోకి వస్తున్నారు

ఒక మతంపై దాడి జరుగుతున్నప్పుడు సీబీఐ విచారణ జరగాల్సిందే

ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు

వరుస సంఘటనలు చూస్తుంటే కుట్రకోణం స్పష్టమవుతోంది

బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది

కానీ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది

ప్రభుత్వ తప్పిదాలను వ్యతిరేకిస్తే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారు

కొల్లు రవీంద్ర, అచ్చెన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై పెట్టింది ముమ్మాటికీ దొంగ కేసు లే

వింత వింత కేసులన్నీ ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారు

పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కేసులు పెట్టారు

అయ్యన్న, కూన రవికుమార్ ఇలా 36మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు

మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం

ఇళ్ల స్థలాల సేకరణ లో జరిగిన అవినీతిలో 40మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకెళ్లటం ఖాయం

మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి

కనీసం 40మంది జైలుకెళ్తారు రాసిపెట్టుకోండి

పేదల కి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిన చోటే కేసులు ఉన్నాయి

మిగిలిన నియోజకవర్గాల్లో భూములు ఎందుకు పంచడం లేదు

చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసులు ఉన్నాయి అంటూ భూముల పంపకం వాయిదా వేస్తున్నారు

1 COMMENT