ఆ గూండాలు నా ఆస్తులపై పడ్డారు..

250

తాను ఈ రోజు ముంబైకి వెళ్తున్నానని, ఇప్పుడే విమానాశ్రయానికి బయల్దేరానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. ముంబైపై చేసిన తన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆమెకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద గొడవే కొనసాగుతోంది. ఆమెను ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరిస్తుంటే…. ఎట్టి పరిస్థితుల్లోనూవెళ్లి తీరుతానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కంగనా కూడా సవాల్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం, గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారని, కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా రెడీ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ కూల్చివేత పెద్ద విశేషమేమీ కాదని, తన స్పిరిట్ (స్ఫూర్తి) ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుందని కంగనా పేర్కొంది.