కిసాన్ రైల్ తో రైతులకు అధిక ఆదాయం

292

-జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం, సెప్టెంబర్ 9:అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులతో వెళుతున్న ‘ కిసాన్ రైల్’ తో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.
అనంతపురం రైల్వే స్టేషన్లో అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే ‘ కిసాన్ రైల్’ను బుధవారం వర్చువల్ వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లు ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి.అంగడి, రాష్ట్ర రహదారులు ,భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ,అనంతపురం ఎంపీ తలారి రంగయ్య,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా అనగానే మధురస్మృతి అందించే ఉద్యాన ఉత్పత్తులకు పేరుగాంచిందన్నారు. కిసాన్ రైల్ ద్వారా రైతులు పండించే పంటలకు మంచి ధర వస్తుందని, వినియోగదారులకు నాణ్యత కలిగిన, పోషకాహార లతో కూడిన ఉత్పత్తులను అందించే వీలు ఉంటుందన్నారు. అనంతపురం నుంచి 36 నుంచి 40 గంటల లోపు ఢిల్లీకి కిసాన్ రైల్ వెళుతుందని, దీనివల్ల పండ్లు రంగు, గట్టిదనం మారకుండా ఉంటాయని, దీని ద్వారా పంట ఉత్పత్తులకు మార్కెట్ లో ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. అనంతపురం పండ్లు అంటే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందన్నారు. భవిష్యత్తులో జిల్లా ఉత్పత్తులకు మరింత డిమాండ్, ధర లభించి రైతులకు మరింత ఆదాయం లభిస్తుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతులను ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, రైతుల సహకారంతో ఈరోజు కిసాన్ రైల్ ను దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగిందన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం తో రైతులకు లబ్ధి చేకూర్చడమే కిసాన్ రైల్ ముఖ్య ఉద్దేశమన్నారు. భవిష్యత్తులో వారానికి ఒకటి.. రోజుకు ఒకటి చొప్పున కిసాన్ రైల్ అనంత నుంచి ఢిల్లీకి వెళ్లేలా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.

అలాగే అనంత ఉద్యాన ఉత్పత్తులు దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైల్ ఏర్పాటు రైల్వే అధికారుల సహకారం ఎంతో ఉందన్నారు. తాము క్షేత్రస్థాయిలో పొలాలకు, మండీలకు వెళ్లి రైతులతో మాట్లాడటం జరిగిందన్నారు. కిసాన్ రైల్ ప్రారంభానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ఎంపీకి, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా సమయంలో పండిన పంటకు ధర లేక రైతులు నష్టపోయారని, ఇలాంటి సమయంలో కిసాన్ రైల్ ద్వారా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు ఉద్యాన ఉత్పత్తులను ట్రక్కు ద్వారా తరలించాలంటే 5 రోజుల సమయం పట్టేదని, అందువల్ల పండు రంగు, చిక్కదనం మారుతోందని, పండు మెత్తగా మారి 10-15 శాతం పండ్లు పారవేసి రైతులు నష్టపోయే అవకాశం ఉండేదన్నారు. అయితే 36 నుంచి 40 గంటల్లోనే కిసాన్ రైల్ అనంత నుంచి ఢిల్లీకి చేరుకుంటుందని దీనిద్వారా పండు మెత్తబడటం, రంగు మారడంగాని లాంటివి ఉండవని, పండు తాజాగా, నాణ్యతగా, రుచిగా ఉండడం వల్ల వెంటనే వినియోగదారులు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారన్నారు. దీని వల్ల రైతులు పడే అవకాశం ఉందని, పండ్లకు ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడేందుకు కిసాన్ రైల్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపా