రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయి: సోము వీర్రాజు

0
34

విశాఖ: అంతర్వేదిలో రథం తగలబడ్డ ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితి ఏపీలో ఎందుకు వచ్చిందనే ఆవేదన కలుగుతోందన్నారు. హిందుత్వానికి విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే వైసీపీ సర్కార్‌పై బీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. అంతర్వేది ఘటనపై సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని సోమువీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే..బీజేపీ ఏపీ ప్రభుత్వంపై కఠినంగా స్పందించాల్సి వస్తుందన్నారు. ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్‌ జరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ బోర్డు రాజకీయ ఉపాధి హామీ కేంద్రంగా మారిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వామీజీలతో బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు విమర్శించారు.