అంతర్వేది ఈవో బదిలీ:మంత్రి వెలంప‌ల్లి

383

నెల్లూరు, అంతర్వేది స్వామి వారి నూత‌న‌ రథంల నిర్మాణానికి అదేశాలు

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు అన్నారు.. సొమ‌వారం బ్రాహ్మ‌ణ వీధి దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు… అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా….కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరి లోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌లు అంతర్వేది రథం నిర్మాణం జ‌రిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్న‌ట్లు తెలిపారు.

హిందువుల దేవాలయల గురించి టీడీపీ కి మాట్లాడే నైతిక హక్కు లేదు..

పుష్కరాల వంక తో 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు……

పుష్కరాల్లో 23 మందిని పొట్టపెట్టుకున్నాడు..

అంతర్వేది ఘటన పై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు..

పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదు…

ఇలాంటి ఘటన లు భవిష్యత్ లో జరగకుండా ప్రతి దేవాలయాల్లో సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసాం…

ప్రభుత్వంకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రతి పక్షాలు కుట్ర చేశారు అనే అనుమానం కలుగుతోంది…

ఈ ప్రభుత్వాన్ని ఒక కులం కి అంటగట్టాలని చూస్తున్నారు…

మండలి లో లోకేష్ కి సవాల్ విసిరితే పారిపోయాడు…

పారిపోయిన వ్యక్తా మమ్మల్ని విమర్శించేది….

అంతర్వేది టెంపుల్ సిబ్బంది పై వేటు, ఈవో పై బదిలీ వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసాం…

అంతర్వేదిలో సిసి కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేశాము.

దుర్గగుడి లో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నాం

వ్యవస్ధలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్న దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేడు

హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తాం

రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నారు

ఇతర దేవాలయాల్లో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము

సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నాము..