ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

522

దిల్లీ: సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యం అంశంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కారు సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఆంగ్ల మాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది.