డ్రాగన్ తోక ఎప్పుడూ వంకరే

460

-క్రాంతి దేవ్ మిత్ర

భారత్ విషయంలో పైకి సానుకూలత ఉన్నట్లు చూపిస్తూ లోపల మాత్రం కుట్ర బుద్దిని బయట పెట్టుకుంటూనే ఉంటుంది. దీనికో ఉదాహరణ ఇస్తాను..
ఇటీవల చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక సర్వే చేసింది. దాని ప్రకారం చైనీయుల్లో 53.5 % మంది భారత్ అంటే, ప్రధాని నరేంద్రమోదీ అంటే 50.7 % సానుకూలం అట.. ఇది చూసి మనవాళ్లంతా మురిసిపోయారు.. కానీ సర్వేలో చూపించిన ఇతర అంశాల్లో భారత్ మీద ఎంత విద్వేషాన్ని బయట పెట్టుకున్నారన్నది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.. జాగ్రత్తగా గమనించండి..
భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడిందని 49.6 % , భారత్ లో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందని 70.8 % మంది అంటున్నారట..
భారత సైన్యంతో చైనాకు ముప్పేమీ లేదని 57.1 % మంది అభిప్రాయమట.. సరిహద్దుల వివాదమే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమని 30 % , అమెరికా జోక్యం కారణమని 24.5 % , చైనా పట్ల భారతీయుల్లో విద్వేషం అని 22.7 % మంది అంటున్నారట..
భారత్ తమ వస్తువులను బహిష్కరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని 35.3 % , సీరియస్ గా తీసుకోవద్దని 29.3 % అభిప్రాయమట.. భారత్ చైనాను ఎప్పటికీ అధిగమించలేదని 54 % మంది చెబుతున్నారట..
చూశారుగా.. నోటితో పలుకరిస్తూ నొసటితో వెక్కిరించడం అంటే ఇదే.. కమ్యూనిస్టు నియంతృత్వ పాలనలో ఎవరైనా తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తారా? అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంటుందా?..
చైనా వారి విషం పూసిన తీపి గుళికలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. మాట మీద నిలబడని మోసకారి చైనా విషయంలో మనం మాటి మాటికీ మోసపోవాల్సిన అవసరమే లేదు..