విశాఖ కంటకుడు చంద్రబాబు

347

-పెదబాబు చినబాబు అండ – భూమాతను చెరబట్టిన పచ్చనేతలు
(వేణుంబాక విజయసాయిరెడ్డి)

పచ్చ పత్రికలు బంగాళాఖాతంలో సునామీ వస్తుందని బెదిరిస్తే… పచ్చనేతలు విశాఖ జిల్లాలో భూకంపం సృష్టించారు. అవును జిల్లాలో భూమి కనిపిస్తే చాలు కబ్జా చేశారు. మాజీ సైనికులకిచ్చే స్థలాలు, భూదాన, దేవాదాయ, వక్ఫ్ భూములు కూడా దీనికి మినహాయింపు కాదు. విశాఖ జిల్లా నాయకులతో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి పుత్రరత్నం లోకేశ్ బాబే ఈ కబ్జాలు చేయించాడు. అవి ఎంతవరకు వెళ్లాయంటే జిల్లాలో భూముల్ని కాపాడేందుకు స్వయంగా అప్పటి ప్రతిపక్షనేత జగన్ గారు ధర్నాలు చేయాల్సివచ్చింది. సింహాచలం, భీమిలి, పెందుర్తి ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట ఒకటేమిటి ఎందెందు వెదికినా పచ్చనేతల భూ కబ్జాలే కనిపిస్తున్నాయి.

రైతులను, దేవుళ్లను సైతం వెంటాడి- వేధించి – శఠగోపాలు పెట్టారు. పెద్దసార్, చిన్నసార్ అండ ఉండటంతో… బరితెగించి బహిరంగంగానే… గుడిని గుడిలోని లింగాన్ని మింగేశారు. కొన్ని తహసీల్దార్ ఆఫీసులు, రిజిస్టార్ ఆఫీసుల్లో తమవారిని పెట్టి… అధికారులను సైతం బలిపశువుల్ని చేశారు. అప్పటి పార్టనర్ బీజీపీ సైతం ఆందోళనబాట పట్టడంతో ఇష్టంలేకపోయినా… సిట్ వేసి చేతులు దులుపుకున్నాడు చంద్రబాబు. విశాఖలో పార్టీ నాయకుల పేర్లు వాడుకుని భూముల విషయంలో జోక్యానికి ప్రయత్నించారని తెలియగానే… వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలను సైతం గెటవుట్ అంది… నీకాదమ్ముందా చంద్రబాబూ?

– విశాఖ జిల్లాలో ఖాళీ జాగా కనిపించినా… బలహీనవర్గాల రైతులకు భూములున్నాయని తెలిసినా… చంద్రబాబు హయాంలో పచ్చతోలు కప్పుకుని మేకవన్నెపులులు వాలిపోయేవి. ప్రభుత్వ భూమైతే రికార్డులు తారుమారు చేసి కబ్జా చేసేవారు… రైతుల భూములైతే చంద్రబాబు, లోకేష్ పేరు చెప్పి బెదిరించి ఎకరం పదివేలుకో ఇరవై వేలుకో కారుచవకగా కొట్టేసేవారు.

– చంద్రబాబు 14ఏళ్లూ … విశాఖపట్నం భూములను పాడి ఆవుల్లా ఉపయోగించుకున్నాడు. దాని ఫలితమే 8 వేల ఎకరాలుండే వక్ఫ్ భూములు ఇప్పుడు 8 ఎకరాలు కూడా లేవు. భూదాన భూములు ఆరేళ్ల క్రితం వరకు 265 ఎకరాలుండగా జగన్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 65 ఎకరాలకు పడిపోయాయి. అంటే 200 ఎకరాలను పచ్చనేతలు మేసేశారు.

– విశాఖ భూ కంభకోణాలపై చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ దద్దరిల్లిపోయేది. ఆధారాలు అసెంబ్లీలో పెట్టింది ఒక్క వైఎస్ఆర్సీపీయే కాదు… మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆందోళనలు చేశారంటూ… పెదబాబు, చినబాబు లోకేషం భూదాహం ఎంతో మీరే ఆలోచించండి.

– విశాఖ నగరంలోనూ, శివార్లలోనూ వైఎస్ఆర్ పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కూడా లాక్కున్నారు పచ్చనేతలు.

– మాజీ మాన్సాస్ ట్రస్ట్ బాస్ అశోక్ గజపతిరాజును డమ్మీని చేసి సింహాచలం భూముల్ని లాక్కున్నారు. బిగ్ బాస్ కు ఈ విజయనగరం బాస్ తలవంచక తప్పలేదు.

– టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి బావమరిది… ఆనందపురంలో 20 ఎకరాల డీ పట్టా భూమిని, దాదాపు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశాడు. అప్పటి అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ అయితే ఏకంగా జైలుకే వెళ్లాడు. ఆయన అక్రమ నిర్మాణాలను జగన్ గారు అధికారంలోకి వచ్చాక కూల్చివేయక తప్పలేదు.

– ఆ మాజీ మంత్రి , అయ్యన్నపాత్రుని రియల్ ఎస్టేట్ వెంచర్లు, రిసార్టుల అక్రమాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ చంద్రబాబు హయాంలో మంత్రుగా చేసినా తమ పచ్చబాస్ కు… కబ్జాకోరు నువ్వంటే నువ్వంటూ ఫిర్యాదులు చేసుకున్నారు. అతను అంత భూమి కబ్జాచేశాడు… లేదు అతనే కబ్జా చేశాడంటూ టెలివిజన్ మీడియా ముందే వాదులాడుకోవడం మనం చూశాం. లేని భూములను చూపించి ఒక జాతీయ బ్యాంక్ దగ్గర వందల కోట్లు కొట్టేశాడో మంత్రి, అతని బంధువులు.

– మధురవాడ, కొమ్మాడలో వెయ్యి ఎకరాల భూమిని అమాయక రైతుల నుంచి లాక్కున్నారు అప్పటి పచ్చనేతలు. 14 వందల ఎకరాల అసైన్డ్ భూముల్ని కాజేశారని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుగారే ఆరోపించారు.

– హుద్ హుద్ తుపాను తర్వాత రెవెన్యూ ఆఫీసుల్లో లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు మాయమైపోయాయని అప్పటి విశాఖ కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చాడంటే … ఇక నేను చెప్పను మీరే అర్థం చేసుకోండి. హుద్ హుద్ వస్తే రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో భూములకు సంబంధించిన రికార్డులు మాత్రమే పోతాయా?

– ఏ చిన్న పని ఉన్నా చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు విశాఖపట్నం రావడం… అప్పటి కలెక్టర్ తో గంటలు గంటలు భూములపై చర్చించడం… ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తమవారికి చెప్పి… జెండా పాతేయడం ఒక ఆనవాయితీగా ఉండేది.

– ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయడు… తాను సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులతో ఒక SIT వేశాడు. అదికూడా పచ్చనేతల భూ కబ్జాలకు సహకరించిన అధికారులనే … ఆ సిట్ లో వేసిన ఘనత చంద్రబాబుది.

– విశాఖ నగరం పక్కపక్కనే ఉన్న డజను మండలాల్లో మూడు లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని రైతులు, స్థానికులు గగ్గోలుపెడితే… లిఖితపూర్వకంగా ఫిర్యాదులిస్తే … అప్పటి సిట్ అధికారులు ఒకటి రెండు మండలాలకే తమ విచారణను పరిమితం చేశారు. What a pity.