యుద్ధం చేయాల్సింది వ్యాధితో కాదు.. రోగుల జేబుపై

308

ఎట్టకేలకు కార్పొరేట్ ఆసుపత్రులపై కేంద్రం కొరడా
యశోద, కేర్ ఫీజులుంపై నోటీసులు
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

మనం యుద్ధం చేయాల్సింది రోగితో కాదు. వ్యాధిపై.. కరోనా ప్రవేశించిన తర్వాత ఎవరికి ఫోను చేసినా, వినిపించే రింగ్‌టోను ఇది. కానీ, గొత కొన్ని నెలల నుంచి ‘యుద్ధం చేయాల్సింది వ్యాధితో కాదు. రోగి జేబుతో’ అన్న చందంగా ఇది రివర్సవుతోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో కరోనా పేరుతో కాసులు దండుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు.. ఈ 180 రోజుల్లో కోల్పోతున్న డబ్బును, కరోనా సాకుతో వడ్డీతో సహా పిండేసుకుంటున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని మీడియా జాలితదలచి వదిలేసినా, సోషల్‌మీడియా మాత్రం శరపరంపరగా నిజాలను వెలుగులోకి తెస్తోంది.ఇది కూడా చదవండి: ‘ప్రైవేటు’పై వేటు.. అంత వీజీ కాదు!

హైదరాబాద్‌లో అయితే, ఏడెనిమిది ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా బూచితో కాసులు దండుకుంటున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం.. వీటికి పాలక పార్టీలు-విపక్ష పార్టీలతో బంధం-అనుబంధం ఉండటమే. వీటిలో ఇటీవలి కాలంలో ఎక్కువ ఆరోపణలకు గురైన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వార్తల్లో నానుతోంది. ప్రధానంగా ఓ రెండు,మూడు ఘటనలు మీడియాె క్కడంతో, కరోనా ఫీజుల దోపిడీ వెలుగులోకి వచ్చినట్టయింది. ముందే ఫీజులు కట్టించుకోవడం, చివరకు మృతి చెందిన రోగి భౌతికకాయాన్ని.. డబ్బులిస్తే తప్ప ఇవ్వని అమానవీయ ఘటనలు, దానికి సంబంధించి రోగుల బంధువులు చేసిన ఆరోపణలు, ఆక్రందనలు సోషల్‌మీడియాలో వీడియోల రూపంలో వెలుగుచూశాయి. ఆస్తులు అమ్ముకుని ఆసుపత్రులకు డబ్బు ధారపోసినా, చివరకు విగతజీవులుగా బయటకొస్తున్న విషాద దృశ్యాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులయితే.. పాజిటివ్ లక్షణాలు కనిపిస్తేనే, రోగి బంధువులను భయపెట్టి, వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటికి రిఫర్ చేస్తున్న ఆర్‌ఎంపి డాక్టర్లకే నెలకు లక్షల రూపాయలు కమిషన్లు ఇస్తున్నారంటే.. ఇక కార్పరేట్ ఆసుపత్రులు ఏ స్ధాయిలో గుంజుతున్నాయో ప్రత్యేకించి అర్ధం చేసుకోవచ్చు.వాటి వివరాలు: ‘ప్రైవేటు’పై వేటు.. అంత వీజీ కాదు!

భీమరంలోని ఓ ఆసుపత్రి వైద్యులు.. కరోనా పేరుతో దోపిడీ చేసిందే కాకుండా, భర్తను కూడా చంపేశారంటూ ఓ మహిళ ఆవేదన సోషల్‌మీడియాలో కలకలం సృష్టించింది. ఇలాంటి హృదనయవిదాకర వీడియోలు, మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో రమేష్ ఆసుపత్రి క్వారంటైన్ సెంటర్‌గా మార్చిన హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించి, మృత్యువాత పడిన రోగుల ఘటన కలచివేసింది. ఇలాంటి ఘటనల్లో మృతుల కుటుంబాలకు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చినప్పటికీ.. మనుషులను తెచ్చి ఇవ్వలేరు. అసలు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా, ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమలవుతున్న పాలకులు.. నష్టపరిహారంతో తప్పను కప్పిపుచ్చుకోవడం చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వంటిదే.

ఈ క్రమంలో.. హైదరాబాద్ లో కార్పొరేట్ ఆసుపత్రులపై కేంద్రం, ఆలస్యంగానయినా కొరడా ఝళిపించడం రోగులకు కాస్తంత ఊరటనే. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై, నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ సీరియస్‌గా స్పందించింది. యశోద్, కేర్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆసుపత్రులు పిండిన ఫీజుల రశీదులన్నీ, సోషల్‌మీడియాలో ప్రత్యక్షమడం, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అద్దం పట్టాయి. అయితే, నిజానికి తెలంగాణ రాష్ర్టంలోని దాదాపు 1200 ఆసుపత్రులపై ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తాయి. కానీ, విచిత్రంగా మూడు ఆసుపత్రులపైనే కొరడా ఝళిపించడం ఆశ్చర్యం.