చెన్నై: సన్‌టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్ , కావేరీ కళానిధి మారన్ భారత్‌లో 2019-20లో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లుగా నిలిచారు. ఈ జంట వార్షిక వేతం రూ.175 కోట్లు. కళానిధి మారన్ 1993లో ఈ కంపెనీని ప్రారంభించారు. ఆయనే ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కళానిధి- కావేరిలు ఏటా చెరో రూ.13.87 కోట్లు వేతనం తీసుకోగా.. రూ.73.63 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా పొందుతున్నారు. అంటే ఒక్కొక్కరు రూ.87.50 కోట్లను పొందుతున్నారు. వీరి జీతాలను ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగించాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.
మారన్‌తో పోల్చుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన వేతనాన్ని రూ. 15 కోట్లుగానే కొనసాగించారు. గత కొన్నేళ్లుగా ఆయన తన వార్షికవేతన పెంపును నిలిపివేశారు. కొవిడ్-19 ప్రభావం కారణంగా తాను వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకొన్నారు. ఆయన 2008-09 నుంచి వార్షికవేతనాన్ని రూ.15కోట్లకు పరిమితం చేశారు. ఏటా దాదాపు రూ. 24కోట్లను ఆయన వదులుకుంటున్నారు.
అదే కంపెనీలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌ల్లో సన్‌టీవీ ఎండీ మహేశ్ కుమారు ముందున్నారు. ఆయన వార్షికంగా రూ.1.78 కోట్లు అందుకుంటున్నారు. దీనిలో 1.16 కోట్లు వేతనం, రూ. 0.62 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మారన్ కుమార్తె, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్యా రూ.1.22 కోట్లు అందుకుంటున్నారు. దీనిలో రూ.80లక్షలు జీతం రూపంలో.. రూ.42లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో లభిస్తోంది. సన్‌టీవీ వార్షికాదాయం రూ.3,653 కోట్లు. ఇదే సమయంలో గతేడాది రూ.3,883 కోట్లు ఆదాయం లభించింది. పన్ను చెల్లించక ముందు ఈ కంపెనీ ఆదాయం రూ.1,797 కోట్లుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే.