ప్రభుత్వంతో పాటు యాజమాన్యాలు కూడా స్పందించాలి

317

– నిమ్మ రాజు చలపతిరావు

జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే నేతల కృషి మేర శ్రీ ఎన్టీఆర్ హయాంలో 1986 జనవరి ఒకటో తేదీన జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు జీవో విడుదలైంది ..దీని ప్రకారం జర్నలిస్టులు నామమాత్రపు వార్షిక ఫీజుతో సభ్యత్వం .. అలాగే యాజమాన్యాలు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంది.. తొలుత లక్ష రూపాయలు నిథితో ఏర్పాటయింది తొలిరోజుల్లో 2,3 పత్రికల యాజమాన్యాలు అదీ ఒకటి రెండు సార్లు చెల్లించాయి. ఇక యూనియన్ తరపున సభ్యత్వం తో పాటు వెల్ఫేర్ ఫండ్ సభ్యత్వ ఫీజు వసూలు చేసి పంపించడం జరిగింది కొంతకాలం తర్వాత తొలిసారిగా ఏర్పాటైన కమిటీ లో నేను ,  సత్యనారాయణ సభ్యులుగా నియమితులయ్యాం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి  షబ్బీర్ అలీ, కమిషనర్ రమణాచారి నేతృత్వంలో 2004 డిసెంబర్ 21న సచివాలయంలో జరిగిన తొలి సమావేశంలో మరణించిన జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలకు తొలిసారిగా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది ,అలాగే ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి కనీసం 30 వేల తగ్గకుండా మంజూరు చేశాం .ఆ సమయంలో లో టెక్నికల్ అభ్యంతరాలు రాష్ట్ర కార్యాలయం నుంచి సమీక్షిస్తున్న అంబటి ఆంజనేయులు ద్వారా సభ్యుల సభ్యత్వ రుసుమును చెక్ ద్వారా తెప్పించి చెల్లించాం. 2013 వరకు రెండు మూడు కమిటీలు పని చేశాయి ఆ తర్వాత కమిటీ లేదు అలాగే యాజమాన్యాలు కూడా నయాపైసా చెల్లించడం లేదు. ప్రభుత్వం అందించిన కేటాయింపులతో ఆ ఫండ్ 60 లక్షలకు చేరింది మానవతా దృక్పథంతో యాజమాన్యాలు ఎంతోకొంత చెల్లించి ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించి కనీసం కోటి రూపాయలకు పెంచాల్సి ఉంది.. దీనికి ప్రస్తుత మంత్రి పేర్ని నాని గారు, కమిషనర్ శ్రీ టి.వి.కె.రెడ్డి గారు నడుం కట్టాలని మనసారా కోరుతున్నాను.