హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులను ఎదుర్కొని, ధర్మ రక్షణలో యువత పాలుపంచుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు.మతమార్పిడులు అడ్డుకొని హిందూ ధర్మంలో ఉన్న సత్యాన్ని సమాజానికి వివరించాలని సూచించారు. స్వధర్మం.. స్వదేశీ.. స్వాభిమానం.. లక్ష్యంగా పనిచేయాలని కోరారు. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో కోటకొండ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కోటకొండ గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చుక్క జనార్ధన్, కార్యదర్శిగా గుండెగారి కాశీనాథ్, ఉపాధ్యక్షులుగా సవారి దస్తప్ప, కుందేళ్ల రవి, కిందిటి కృష్ణ, సహ కార్యదర్శులుగా బీడీల రాము, చెవుల రాకేష్, కావలి నర్సింలు, కోశాధికారిగా చెవుల సాయి, సభ్యులుగా ఈశ్వర్, నాగేష్, ఎం విష్ణు, శివ, విశాల్ లను ఎన్నుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ఈ కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాలస్వామి తెలిపారు. కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నాయకులు కోసిగి బాలప్ప, పేట మారుతి కుమార్, చుక్క రాజు, కమ్మరి మహేష్, బీడీల రాజు, ఎదురింటి బాలు, మరియు విశ్వహిందూపరిషత్, నవ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner