నారా లోకేశ్‌లాగే ప్ర‌భుత్వ‌మూ జ‌ర్న‌లిస్టుల‌కు భ‌రోసా ఇవ్వాలి

295

-రాష్ట్ర‌వ్యాప్తంగా వున్న జ‌ర్న‌లిస్టుల‌కు బీమా సౌక‌ర్యం క‌ల్పించాలి

-బీమా ప‌త్రాలు అందుకున్న సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల డిమాండ్

క‌రోనా క‌ష్ట‌కాలంలో జ‌ర్న‌లిస్టుల బ‌తుకులు గాలిలో దీపాల‌య్యాయ‌ని, ఇటువంటి స‌మ‌యంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ త‌మ‌కు క‌ల్పించిన ఇన్సూరెన్స్ సౌక‌ర్యం వ‌ల్ల భ‌రోసా దొరికింద‌ని జ‌ర్న‌లిస్టులు సంతోషం వ్య‌క్తం చేశారు. నారా లోకేశ్ మాదిరిగానే ప్ర‌భుత్వం కూడా జ‌ర్న‌లిస్టుల‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా బీమా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌గిరిలోని ఎంఎస్ఎస్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం జ‌ర్న‌లిస్టుల‌కు ఇన్సూరెన్స్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. మొత్తం 71 మంది జ‌ర్న‌లిస్టుల‌కు బీమా సౌక‌ర్యం క‌ల్పించారు. బీమా పొందిన జ‌ర్న‌లిస్టు స‌హ‌జ‌మ‌ర‌ణం (కోవిడ్ వ‌ల్ల‌నైనా) అయితే 10 ల‌క్ష‌లు, ప్ర‌మాదంలో మృతిచెందితే 20 ల‌క్ష‌ల‌ను పాల‌సీలో పేర్కొన్న నామినీల‌కు అంద‌జేస్తుందీ పాల‌సీ. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ సుర‌క్ష పాల‌సీ కింద ప్రీమియంకి ఒక్కొక్క‌టి 5404 రూపాయ‌ల లెక్క‌న చేయించారు. ఇన్సూరెన్స్ ప‌త్రాల‌ను అందుకున్న జ‌ర్న‌లిస్టులు మాట్లాడుతూ రాష్ట్ర‌వ్యాప్తంగా కోవిడ్ వైర‌స్ వ్యాప్తి జ‌ర్న‌లిస్టుల పాలిట శాపంగా మారింద‌ని, ఇటువంటి స‌మ‌యంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ స్పందించి మంగ‌ళ‌గిరి జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఈ బీమాని క‌ల్పించ‌డం ఎంతో ధీమానిచ్చింద‌ని మ‌ల్లేశ్వ‌ర‌రావు అనే జ‌ర్న‌లిస్టు సంతోషం వ్య‌క్తం చేశారు. జ‌ర్న‌లిస్టు రాంబాబు మాట్లాడుతూ కంటికి క‌నిపించ‌ని మ‌హ‌మ్మారితో క‌ళ్ల ముందే జ‌ర్న‌లిస్టులు మృత్యువాత ప‌డుతున్న నేప‌థ్యంలో నారా లోకేశ్ జ‌ర్న‌లిస్టుల విప‌త్క‌ర ప‌రిస్థితిని చూసి బీమాతో ధీమా క‌ల్పించ‌డం భ‌రోసా దొరికింద‌న్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొలిక‌పూడి రూఫ‌స్ మాట్లాడుతూ కుల‌,మత‌, రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇన్సూరెన్స్ క‌ల్పించిన నారా లోకేశ్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. అంద‌రి బంధువులైన జ‌ర్న‌లిస్టుల ఇబ్బందులు గుర్తించి, రాజ‌కీయ‌పార్టీల ప్ర‌మేయం లేకుండా బీమా క‌ల్పించడాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కూర‌పాటి ముర‌ళీకృష్ణంరాజు మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లిన వెంట‌నే స్పందించి ..ఈ బీమా సౌక‌ర్యం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఒక నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్న‌లిస్టులంద‌రికీ నారా లోకేశ్ బీమా క‌ల్పించార‌ని, ప్ర‌భుత్వం కూడా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇన్సూరెన్స్ క‌ల్పించాల‌ని కోరారు.

బీమా కంపెనీల ఒప్పించి…పాలసీలు ఇప్పించిన లోకేశ్‌
వాస్త‌వంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలు కోవిడ్ మ‌ర‌ణాలు, స‌హ‌జ‌మ‌ర‌ణాలకు పాల‌సీలు ఇవ్వ‌డంలేదు. కొన్ని కంపెనీలు ఇస్తున్నా… చాలా ఎక్కువ‌గా ప్రీమియం వుండ‌టం, కోవిడ్ నెగెటివ్‌, డాక్ట‌ర్ ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికెట్లు జ‌త‌చేయాల్సి వుండ‌టంతో ఈ బీమా సౌక‌ర్యం అంద‌రికీ అంద‌డంలేదు. అయితే ఇటీవ‌ల ‌కాలంలో వ‌రుస‌గా జ‌ర్న‌లిస్టులు క‌రోనా కోర‌ల‌కు చిక్కి మృతి చెందుతుండ‌టంతో క‌ల‌త చెందిన నారా లోకేశ్ త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌ర్న‌లిస్టుల వ‌ర‌కైనా భ‌రోసా క‌ల్పించాల‌నే ఆలోచ‌న‌తో ఈ ఇన్సూరెన్స్ పాల‌సీ తెచ్చేందుకు కృషి చేశారు. టిడిపి కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్‌గా పార్టీ స‌భ్య‌త్వం తీసుకుంటే బీమా క‌ల్పించే పాల‌సీలు కొన్ని ల‌క్ష‌లు చేయించిన‌ నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి జ‌ర్న‌లిస్టుల పాల‌సీ చేసే విధంగా ఎస్‌బీఐ లైఫ్‌ని ఒప్పించ‌గ‌లిగారు. దీంతో కోవిడ్/స‌హ‌జ మ‌ర‌ణాలైనా పాల‌సీ వ‌ర్తించే విధంగా జ‌ర్న‌లిస్టు బీమా చేయించి ధీమా క‌ల్పించిన నారా లోకేశ్‌..శెహ‌భాష్ అంటున్నారు జ‌ర్న‌లిస్టులు.