బారింగ్ ఏ మిరకిల్; చంద్రబాబు నాయుడు విల్ నెవెర్…

214

ఫేస్ బుక్ లో ఉన్న వారికి S. వెంకట్ నారాయణ్ గారి గురించి పరిచయం అవసరం లేకపోవచ్చు. ఫేస్ బుక్ లో ఆయన చాలా ఆక్టివ్ గా ఉంటారు. మన తెలుగు వారు. ఇండియా టుడే మ్యాగజైన్ కు తొలి సంపాదకులు. ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ లోని ఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ కు చైర్మన్. కొన్ని విదేశీ పత్రికలకు ఆయన ఇండియన్ రిప్రెజంటేటివ్.
మన దేశం లోని పలు విదేశీ రాయబార కార్యాలయాలకు ఆయన గౌరవ అతిధి.
ఎన్ టీ. రామారావు 1983 ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి మన రాష్ట్రానికి వచ్చిన ఆయన -ఇండియా టుడే లో ఆయన-తన కథనాన్ని-…’బారింగ్ ఏ మిరకిల్;ఎన్ టీ రామారావు ఈజ్ డిస్టేయిన్డ్ టు బికమ్ ది నెక్ట్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్…..’అని మొదలు పెట్టారు.
ఆయనను ఇప్పుడు నేను కాపీ కొడుతున్నాను-ఇలా…
…’బారింగ్ ఏ మిరకిల్, చంద్రబాబు నాయుడు విల్ నెవెర్ బికం ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ పీ. అగైన్’
ఎందుకంటే…….! పీపుల్ విల్ నాట్ అలౌ హిం టు కం బ్యాక్.
*సింగపూర్ ను తలదన్నే రాజధానిని కడతాను అన్నారు. కట్టలేదు.
* సింగపూర్ కట్టకపోతే కట్టకపోయారు…కనీసం మామూలు రాజధానికి కావలసిన ఓ అరడజను శాశ్వత భవనాలైనా కట్టండని రైతులు 33 వేల ఎకరాల తమ పంటభూముల్ని ఇస్తే…ఐదేళ్లపాటు అధికారం అనుభవించిన చంద్రబాబు…ఆ నాలుగైదు శాశ్వత భవనాలు కూడా కట్టించలేకపోయారు.
*సరే….ఓ అరడజను శాశ్వత భవనాలైనా కట్టించకపోతే పోయారు గానీ…మీరైనా మన రాష్ట్రం లో ఓ ఇల్లు కట్టుకోమంటే…అదీ చేయకుండా; పక్క రాష్ట్రం లో ఓ ఇంద్ర భవనం లాటి ఇల్లు కట్టుకున్నారు.
*పాలన అయినా మంచిగా చేయండి అని అధికారం అప్పగిస్తే….పాలనానుభవం లేని కొడుకుని నిముషాల మీద ఎం ఎల్ సీ చేసి; మంత్రి పదవి లో కూర్చోబెట్టి; పార్టీని రాష్ట్రాన్ని అప్పగించేశారు.
*బీ సీ ల్లో కులానికో కార్పొరేషన్ పెడతాను అన్నారు. పెట్టలేదు.
* కాపులకు రిజెర్వేషన్ల కల్పిస్తాను అన్నారు. అవి ఇవ్వకుండా బయటపడడం ఎలాగో చూడడానికి విపరీతమైన శక్తియుక్తులు ప్రదర్శించారు.
*కాపు కార్పొరేషన్ కు ఏటా 500 కోట్లు కేటాయిస్తాను అన్నారు. అంటే-5 ఏళ్లకు 2500 కోట్లు. అందులో సగం ఇవ్వలేదు.
* ఏ పూట కు అవసరమైన హామీ …ఆ పూట ఇవ్వడం తప్ప; మాటలో…ఆలోచనలో….చేతలో…..చిత్తశుద్ధి కనపరచిన పాపాన పోలేదు.
మాట వరుసకు, తిరుపతి లో చైనా కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ …బ్రహ్మాన్దమైన కర్మాగారం స్థాపిస్తున్నది అంటూ…ఓ ఎకరం నేల చదును చేసి(హెలికాప్టర్ దిగడానికి)ఫ్యాక్టరీ కి భూమిపూజ చేశారు. ఓ 5 కోట్లు ఖర్చు అయ్యాయి. దానికి ఎకరం నెలకూడా సేకరించలేదు. టీసీఎల్ కు ఇవ్వలేదు. నాలుగు రోజులు చూసి; చైనా వాళ్ళు-వాళ్ళ దోవన వాళ్ళు పోయారు. అక్కడ పెడతానన్న ఎలెక్ట్రానిక్ హబ్-పబ్లిసిటీ కి పరిమితం.
ఇలా… హబ్ లు…హబ్ లు అంటూ-ర్రాష్టాన్ని, రాజకీయాన్ని, పాలనను గబ్బెత్తించారు.
*అధికారం లోకి వస్తే…రైతులకు ఋణ విముక్తి ఫైల్ మీద తొలి సంతకం పెడతాను అన్నారు. వచ్చాక; రైతులను ఋణ విముక్తులను చేయడానికి ఏమి చేయాలో ఆలోచించే కమిటీ ఏర్పాటు ఫైలు పై తొలి సంతకం పెట్టారు.
*అధికారం లో ఉంటూ…; వేరే పార్టీ గుర్తుమీద గెలిచిన ఓ పాతిక మందిని చేర్చుకుని వాళ్లలో ముగ్గురు, నలుగురికి మంత్రిపదవులిచ్చి…;రాజకీయాలలో నైతిక విలువలు లేకుండా పోయినయ్యంటూ ఆవేదన చెందుతూ…’ మన సమాజం ఎటు పోతోందంటూ…బాధతో మెలికలు తిరిగిపోవడం చంద్రబాబు కే చెల్లింది. ఆ పాతిక మందీ ఇప్పుడు పుచ్చు పట్టి పోయారు.
* ఇలా….తిరిగి ఆయన అధికారం లోకి ఎందుకు రాగూడదో-ఓ వంద ఉదాహరణలు సాధికారికంగా చెప్పవచ్చు. అయినారాజకీయాల్లో నైతిక విలువలు దిగజారిపోతున్నాయంటూ చంద్రబాబు ఆవేదన పడుతుంటారు.నిప్పు..నిప్పు అంటూ మధ్య మధ్యలో- కుడి చేతి బొటన వేలు…కాకపోతే-చూపుడు వేలుతో గుండెలమీదా టపీ టపీమని పొడుచుకుంటుంటారు.1978 నుంచి చూస్తున్నా….ఆయనను, ఆయన రాజకీయాలను.
. అందుకే….రాష్ట్రం గురించి చంద్రబాబు నోరు తెరిచినప్పుడల్లా; ఎస్. వెంకట్ నారాయణ్ గారు; 1983 లో ఆయన ఎన్టీఆర్ పై రాసిన కథనం గుర్తుకు వస్తుంటుంది.

-భోగాది వెంకట రాయుడు