‘భూమిపూజ’ తో ఏ పీ లో బీజేపీ బలపడుతుందా?

398

అయోధ్య లో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి నిన్న భూమి పూజ చేశారు. దేశం లో టీవీలు ఉండి; మోడీ శంకుస్థాపన చేసే సమయానికి ఇళ్లల్లో కరెంట్ ఉన్నవారందరూ ఈ శంకుస్థాపన దృశ్యాన్ని కనులారా వీక్షించారు. శ్రీరామ చంద్రమూర్తి కి భక్తితో దణ్ణం పెట్టుకున్నారు. కొందరు అగరొత్తులు కూడా వెలిగించి టీవీల ముందు పెట్టారు. ఆ కార్యక్రమం టీవీలలో ప్రసారమవుతున్నంత సేపూ ఆధ్యాత్మిక చింతనలో గడిపారు.

ఈ శంకుస్థాపన – భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన సంఘటనగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దీనిని బీజేపీ సాక్షాత్కరింపచేసిందనడంలో కూడా మరో మాటకు తావులేదు.
అయోధ్యలో రామాలయం అనే అజరామరమైన భారతీయుల కోర్కె కార్యరూపం దాల్చడానికి కారణభూతమైన బీజేపీ కి ఏ పీ లో రాజకీయంగా లాభిస్తుందా? అంటే….
‘లాభించదు’అని బాండ్ పేపర్ పై రాసిచ్చేయవచ్చు. ఎందుకంటే….ఆంధ్ర హిందువులకు రాజకీయం వేరు…; దైవచింతన వేరు. అవి రెండూ వేరు వేరు అని చెప్పడానికి -జగన్ మోహన్ రెడ్డి విజయమే ఒక ఉదాహరణ. ఆయన క్రైస్తవుడు అని తెలిసినప్పటికీ; హిందువులు ఆయనే కావాలని భావించారు. దైవ చింతన అనేది పూర్తిగా వ్యక్తిగతం అని హిందువులు భావించడమే ఇందుకు కారణం. రాజకీయానికి, మతానికి లింకు లేదు.. బీజేపీ పెరగడానికి కారణభూతమైన ముస్లిం లు – ఆంధ్ర సమాజంలో అంతర్భాగం. ఎవరి మత విశ్వాసాలు వారివి. ఒకరిని చూసి ఒకరు అసహనానికి లోనయ్యే పరిస్థితులు ఆంధ్రలో లేవు.

అందుకే…;.అయోధ్య రాముడు -ఆంధ్రకు సంబంధించినంతవరకు-బీజేపీ కి పెద్దగా ఉపయోగపడడు.
ఇప్పుడు .8గా ఉన్న మొన్న ఎన్నికల నాటి బీజేపీ ఓట్ బ్యాంక్-1.8 అయితే గొప్ప.రాజకీయ కారణాల వల్ల బీజేపీ బలపడితే బలపడవచ్చేమోగానీ; రాములువారి వల్ల మాత్రం బలపడదు.
ఆంధ్ర అనే కాదు. కేరళ, తమిళనాడులో కూడా రాముడు బీజేపీకి పెద్దగా ఉపయోగపడడు. కర్ణాటక లో మాత్రం బీజేపీకి కొద్దిగా ఉపయోగపడవచ్చు; అక్కడ ఎడ్యూయూరప్ప ఉన్నందువల్ల. ఒడిశా లో కూడా బీజేపీ కి పెద్దగా వర్క్ ఔట్ కాదు. నవీన్ పట్నాయక్ ఉన్నారక్కడ.
ఉత్తరభారత దేశం పార్టీ గానే అధికారంలోకి వచ్చిన బీజేపీ…;ఉత్తర భారతదేశంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మాత్రం అయోధ్య రాములోరు ఉపయోగపడతారు. జై శ్రీరామ్!

-భోగాది వెంకట రాయుడు