ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతి కి అంకితం

413

నేటి కోట్లాది హిందువుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం వెనకాల తెలుగు తేజము మన గుణంపల్లి పుల్లారెడ్డి గారి కృషి మరవలేనిది…పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం,కళ్లముందు కదలాడుతుంది. నీతినిజాయితీలను పాటించిన నేతి మిఠాయిల వ్యాపారిగా,ధార్మిక నాయకునిగా, సామాజిక కార్యకర్తగా…కృషియే సర్వోత్కృష్ట ధ్యానము అని నమ్మిన మహావ్యక్తి.
|| ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతి కి అంకితం .||
అయోధ్య రామ జన్మభూమి నిర్మాణం అని మాట పలికితే దాని వెనుక మరొక అవి స్మరణీయ దిగ్గజం…..స్వర్గీయ గుణంపల్లిపుల్లా రెడ్డి( జి పుల్లారెడ్డి నేతి మిఠాయిల అధినేత)
ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున…
ఢిల్లీ కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది.
కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు .
అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి .
లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు .
పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా….
ఇంట్లోకి వెళ్లి వచ్చి చేతిలో రెండు లక్షల రూపాయలు అశోక్ జీ చేతిలో పెట్టి…
సాయంత్రానికి మరో పది లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ…
రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించ వలసిందే దాని కొరకు పోరాడవలసినదే… ఎక్కడికైనా… ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం…
కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక.
ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు పట్టుకొని …
నేను బతికుండగా.., కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను .
” అవసరమైతే ఈ ఇల్లు అమ్మి వేద్దాం …ఆమె లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మి వేద్దాం …., అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్ జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు”.
అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై… ఆనందాశ్రువులు కనుకొనుకులలో సుడులు తిరుగుతుండగా….,
నీవంటి కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది.అపజయం అన్నదే లేదు… ఎప్పుడు తల వంచ వలసిన అవసరం రాదు అంటూ…భారతమాత ప్రియ పుత్రుని ఆలింగనం చేసుకున్నారు .ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు కీర్తిశేషులు అశోక్ సింగల్ జి….ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి..
తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేకమంది అవిజ్ఞాతులైన హిందూధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే ..రామజన్మభూమి నిర్మాణం, దాని విజయం వాళ్లందరి స్మృతులకు అంకితం.