బాలసుబ్రహ్మణ్యానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

337

ఓ వీడియో ద్వారా తెలిపిన బాలు
కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందన్న గాయకుడు
అభిమానులు ఆందోళన చెందవద్దని వ్యాఖ్య
ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందన్న ఎస్పీబీ
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల అశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలాయిమేడులోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.