ఈ ఘడియల కోసమే కొన్ని తరాలు పోరాటం చేశాయి : సీఎం యోగి

384

లక్నో : ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా, న్యాయ ప్రక్రియ ద్వారా ఓ సమస్యను శాంతియుతంగా ఎలా పరిష్కరించవచ్చో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ దేశాలకు చూపించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అత్యంత పవిత్రమైన ఈ ఘడియల కోసమే కొన్ని తరాలు, సాధులు, సంతులు పోరాటం చేశారని ఆయన తెలిపారు. కొన్ని తరాలకు తరాలు ఈ అమృత ఘడియల కోసం వేచి చూస్తున్నాయని తెలిపారు. అయోధ్య భూమి పూజ పూర్తైన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో యోగి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం ఘనంగా జరుగుతుందని, అదే సమయంలో అయోధ్య నగరాన్ని కూడా సాంస్కృతిక పరంగా, ఓ శక్తి శాలి నగరంగా తీర్చదిద్దడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు. కరోనా ఉన్న కారణంగానే, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొద్ది మందికే ఆహ్వానాలు పంపినట్లు యోగి పునరుద్ఘాటించారు.