పట్టభద్రుల ఎన్నికలకు అంతా సిద్ధం

479

వచ్చే ఏడాది జరగున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అందరూ సిద్ధం అవుతున్నారు.హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగా రెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి వచ్చే మార్చ్ లో ఎన్నిక జరగనుంది .ఒకటి బీజేపీ సిట్టింగ్ ఇంకొకటి టి ఆర్ ఎస్ సిట్టింగ్ స్థానం .ఎవరికీ వారు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం తో పటు రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు .మరోవైపున కాంగ్రెస్ కూడా ఈరెండు స్థానాలమీద కన్ను వేసినట్లు తెలుస్తుంది జీవన్ రెడ్డి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం నుండి గెలవడంతో ఈ రెండు స్థానాలనుండికూడా తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధం అవుతుందని తెలుస్తోంది అయితే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీకి ఆశక్తి చుపిస్తునట్లు తెలుస్తోంది తనకి మద్దతు ఇవ్వాల్సిందిగా అటు వామపక్షాలను ఇటు కాంగ్రెస్ ను అడుగుతున్నాడని వినికిడి .వామపక్షాల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం తాము పోటీచేయడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం ఆ పార్టీనుండి పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు కూడా తమ రాష్ట్ర నాయకత్వం మీద వత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ధ్వారా అందుతున్న సమాచారం.మనకు ఓట్లున్నాయి క్యాడర్ ఉంది అలాంటప్పుడు మనం పోటీచేయకుండా కోదాడరం కు ఎందుకు మద్దతు ఇవ్వడం పైగా అయన జాక్ చైర్మన్ కాదు ఒక పార్టీ అధ్యక్షుడు అలాంటప్ప్పుడు మనమే పోతిచేయాలి అనే వత్తిడి పార్టీ నాయకత్వం మీద ఉందని చెబుతున్నారు .

ఇది ఇలా ఉంటె కోదండరాం తాను సుదీర్ఘ కాలంపనిచేసిన హైదరాబాద్ వదిలేసి ఖమ్మం వరంగల్ నల్గొండ ఎందుకు వస్తున్నట్లు.హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని పోటీచేస్తే లోకల్ అవుతాడు అలాంటిది అది వదిలేసి నాన్ లోకల్ స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు దీనిలో ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు . టి ఆర్ ఎస్ సిట్టింగ్ స్థానం మీద ఎందుకు కన్ను వేసినట్లు, బీజేపీ సిటింగ్ స్థానాన్ని వారికీ వదిలేసినదుకు ఇక్కడ మద్దతు ఇవ్వమని లేక లోపాయికారి ఒప్పందం ఏమైనా పెట్టుకుందామనే ఆలోచన ఏమైనా చేస్తున్నాడా లేకుంటే ఖమ్మం నల్లగొండ వరంగల్ స్థానాన్ని ఎందుకు ఎంచుకుంటాడు సంథింగ్ ఏదో ఉంది అంటున్నాయి రాజకీయ వర్గాలు . నిజంగానే బీజేపీ తో లోపాయికారి ఒప్పందం ఏమైనా చేసుకుంటే వామపక్షాలు ఆయనకు మద్దతు ఇవ్వకపోవచ్చు అనే చర్చ కూడా ఉంది .గత ఎన్నికలలో ఇక్కడనుండి ప్రభకర్ రెడ్డి ని వామపక్షాలు బరిలోకి దించాయి.

రంగంలోకి జర్నలిస్టు ఫైర్ బ్రాండ్?

బీజేపీ కోదండరాంతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటే బలమైన అభ్యర్థిని పెట్టకపోవచ్చని అంటున్నాయి రాజకీయ వర్గాలు .ఆ పార్టీలో ఆశావహులు కాసం వెంకటేశ్వర్లు రాకేష్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి మరికొంతమంది కూడా పోటీ చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు ఏమి జరుగుతుందో చూడాలి ఇక టి ఆర్ ఎస్ సిట్టింగ్ స్థానాన్ని మల్లి కైవసం చేసుకునేందుకు సిద్ధం అవుతుంది కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది పల్లాను పూర్తి కాలం రైతు సమన్వయ సమితికి కేటాయించాలని ఆయన సేవలను రైతు సమన్వయ సమితిలో ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పిటా వేస్తున్నాడు ఇప్పటికే పల్లా రైతు సమన్వయ సమితి కి ఛైర్మెన్ గా ఉన్నాడు క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి ఫుల్ టైం సమన్వయ సమితికి కేటాయించాలని పల్లా కు కేసీర్ చెప్పినట్లు సమాచారం రైతు వేదికలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేస్తున్నారు మరోవైపు నియంత్రిత సాగు విధానాన్ని తెచ్చారు వీటన్నిటి రీత్యా బాగా కష్టపడే పల్లాను వ్యవసాయరంగానికి రైతులకు కేటాయించాలనే ఆలోచన తో ఉన్నారని టి ఆర్ ఎస్ క్యాడర్ ద్వారా తెలుస్తున్న సమాచారం.

ఇటీవల జరిగిన ఉపాధ్యా, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు రావడంతో టి ఆర్ ఎస్ మార్చిలో జరిగే గ్రాడ్యువేట్ నియోజక వర్గాల ఎన్నికలలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలని దానిమీద కేసీఆర్ దృష్టి సారించారని సమాచారం.డైరెక్ట్ గా పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించడమా లేక స్వతంత్ర అభ్యర్థిని బలపరచడమా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా వస్తున్న సమాచారం స్వతంత్ర అభ్యర్థి అయితే ఎవరున్నారనే అన్వేషణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో జర్నలిస్ట్ నాయకుడు పివి శ్రీనివాసరావు తన ఆసక్తిని కేసీఆర్ కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లినట్లు టి ఆర్ ఎస్ పార్టీ వర్గాల ద్వారా వస్తున్న వార్తలు .పి వి గతంలో టీవీ 9 లో పొలిటికల్ రిపోర్టర్ గా పని చేసాడు ఇప్పుడు టి న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు .అలాగే వామపక్ష రాజకీయాలలో క్రియాశీలకంగా పూర్తి కాలం కార్యకర్త గాకుండా పనిచేసాడు.సుమారు రెండు దశాబ్దాలు వామపక్ష పార్టీలో పనిచేసిన పివి విద్యార్థి సంఘం ఖమ్మం పట్టణ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్టేట్ జనరల్ సెక్రటరీ గా పనిచేసాడు అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు .తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్ట్ నాయకుడిగా ఉంటూ ఉద్యమానికి అండదండలు అందించడమే కాకుండా యూనియన్ తరుపున అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఒకవేళ పార్టీ అభ్యర్థిని నిలబెట్టనిచో మా జర్నలిస్ట్ కమ్యూనిటీకి కేటాయించి టి ఆర్ ఎస్ మద్దతు ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు టి ఆర్ ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు .పార్టీ అభ్యర్థిని పెట్టడమా లేక స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇవ్వడమా అనేది ఫైనల్ కావాల్సివుంది. మొత్తానికి ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది .మరి కొద్దిరోజులలో క్లారటీ వచ్చే అవకాశం ఉంది .