తిరుపతి : మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమాలు రాకూడదనే సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు దృష్టి పెట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే, అందరికీ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ బిల్లు పెట్టారని, రాజధాని రైతులకు ఏ విధంగా నష్టం జరగదని ప్రకటించారు. విద్యాసంస్థలకు ఇచ్చిన భూముల్లో విద్యాసంస్థలు వస్తాయని, మూడు రాజధానులను అభివృద్ధి చేసేలా జగన్‌కు దేవుడు ఆశీస్సులు ఉండాలని రోజా ఆకాంక్షించారు.

By RJ

Leave a Reply

Close Bitnami banner